ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RP Sisodiya: ఏపీలో కృష్ణా నదికి ఎన్నడూ రానంత వరద..

ABN, Publish Date - Sep 11 , 2024 | 12:03 PM

వరద నష్టంపై అంచనా వేసేందుకు రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా నేతృత్వంలోని కేంద్ర బృందం ఏపీకి చేరుకుంది. ఎస్డీఎమ్ఏ కార్యాలయంలో కేంద్ర బృందానికి వరద పరిస్థితిని.. జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి అధికారులు వివరిస్తున్నారు.

అమరావతి: వరద నష్టంపై అంచనా వేసేందుకు రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా నేతృత్వంలోని కేంద్ర బృందం ఏపీకి చేరుకుంది. ఎస్డీఎమ్ఏ కార్యాలయంలో కేంద్ర బృందానికి వరద పరిస్థితిని.. జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి అధికారులు వివరిస్తున్నారు. శాఖల వారీగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి అధికారులు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ టీంతో ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఇంకోవైపు అల్పపీడన ద్రోణులు ఏర్పడ్డాయన్నారు. దీనికి తోడు ఒరిస్సాలో వర్షాలు బాగా పడడం.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం పడుతుందని అంచనాలు ఉన్నాయన్నారు.


అయితే అనుకోని విధంగా భారీ వర్షాలు పడ్డాయని పేర్కొన్నారు. ఏపీలో ఎన్నడూ రానంత వరద కృష్ణా నదికి వచ్చిందని ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు. వరదతో పాటు.. భారీగా వర్షాలు కురిశాయన్నారు.పది రోజుల పాటు పెద్ద ఎత్తున వరద సహయక చర్యలు చేపట్టామన్నారు. అన్ని శాఖల్లోని.. అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు వరద సహయక చర్యల్లోనే ఉన్నామన్నారు. సీఎం చంద్రబాబు పది రోజుల పాటు కలెక్టరేట్లోనే ఉండి వరద సహయక చర్యలపై పర్యవేక్షించారన్నారు.


ఏపీకి వరదల వల్ల అపార నష్టం సంభవించిందన్నారు. లక్షలాది ఇళ్లు నీట మునిగాయని.. మొత్తం వరదల్లో దాదాపు ఏడు లక్షల మంది ఇబ్బందులు పడ్డారన్నారు. వరద నష్టం రూ. 6882 కోట్లు వచ్చిందని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టు ఆర్పీ సిసోడియా తెలిపారు. పంటలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు. ఇంకా ఎన్న్యూమరేషన్ కొనసాగుతోందని ఆర్పీ సిసోడియా తెలిపారు.

Updated Date - Sep 11 , 2024 | 12:03 PM

Advertising
Advertising