ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lanka dinakar: ఏపీ బడ్జెట్‌‌పై లంకా దినకర్ స్పందన

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:33 PM

Andhrapradesh: రూ.2.94 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధికంగా విద్య, నైపుణ్య రంగం , వైద్య, వ్యవసాయం, ఇరిగేషన్, పంచాయితీ రాజ్- గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి - రాష్ట్ర రహదారుల కోసం కేటాయింపులు చేశారన్నారు. అభివృద్ధికి పెద్ద పీఠ వేస్తూనే వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం దాదాపు 23% బడ్జెట్ నిధులు కేటాయింపులు చేయడమంటే, ఈ వర్గాలను స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వామ్యం చేయడమని చెప్పవచ్చన్నారు.

Lanka dinkar

అమరావతి, నవంబర్ 11: జగన్ పాలన విధ్వంసం నుంచి వికాసంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా ఏపీ బడ్జెట్ ఉందని 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ (20 principles implementation chairman Lanka Dinkar) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి, సంక్షేమం రెండిటికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత కనపడిందన్నారు. 32,712 కోట్ల రూపాయల మూలధన వ్యయం బడ్జెట్ కేటాయింపులు ఉత్పాదక అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తికి మార్గం సుగమమైందన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి బాధ్యతరాహిత్యంగా మోహం చాటేశారంటూ విరుచుకుపడ్డారు.

KTR: ఢిల్లీకి హుటాహుటిన కేటీఆర్.. ఎందుకంటే


వికసిత ఆంధ్ర - స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధన ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పన వికసిత భారత్‌లో భాగస్వామ్యం కావడానికి ఈ బడ్జెట్ ఊతం ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత స్పృశిస్తుందన్నారు. ఈ బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లలో అత్యధికంగా విద్య, నైపుణ్య రంగం , వైద్య, వ్యవసాయం, ఇరిగేషన్, పంచాయితీ రాజ్- గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి - రాష్ట్ర రహదారుల కోసం కేటాయింపులు చేశారన్నారు. అభివృద్ధికి పెద్ద పీఠ వేస్తూనే వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం దాదాపు 23% బడ్జెట్ నిధులు కేటాయింపులు చేయడమంటే, ఈ వర్గాలను స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వామ్యం చేయడమని చెప్పవచ్చన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో 40 % పైగా వాటా ఉన్న వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 43,402 కోట్లు కేటాయించడం ద్వారా రైతు సంక్షేమ ప్రభుత్వంగా కనపడుతోందన్నారు.

AP Budget 2024-25: అసెంబ్లీలో ఇంట్రస్టింగ్ సీన్.. అబాసుపాలైన వైసీపీ..


గత 5 సంవత్సరాలుగా జగన్ పాలన విధ్వంసం వల్ల తలకు మించిన భారంతో రాష్ట్ర ఆర్థికమంత్రి రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనంతరం ఇప్పుడు ఆలస్యంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టె పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ బడ్జెట్ సమావేశాలకు మొహం చాటేయడం బాధ్యత రాహిత్యమని... బాధ్యతలేని వారు ప్రతిపక్షం అనే మాట ఆచరించే అర్హత లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇప్పుడు మొహం చాటేశారంటూ లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Rushikonda : రుషికొండ ఫైళ్లు మాయం!

AP Assembly Session: ఏపీ వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 02:37 PM