Forgery Petrol: వైసీపీ నేత బంకులో కల్తీ పెట్రోల్.. వాహనదారుల ఆందోళన..
ABN, Publish Date - Jul 14 , 2024 | 09:17 AM
కృష్ణాజిల్లా: మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సన్నిహితుడు, వైసీపీ నేత షా కీర్తికుమార్ జీవావత్‌కు చెందిన షా గులాబ్‌చంద్ జీవావత్ అండ్ కో పెట్రోలు బంకులో కల్తీ పెట్రోలు విక్రయం కలకలం రేపింది. దీంతో గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు.
కృష్ణాజిల్లా: మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సన్నిహితుడు, వైసీపీ నేత షా కీర్తికుమార్ జీవావత్‌కు చెందిన షా గులాబ్‌చంద్ జీవావత్ అండ్ కో పెట్రోలు బంకులో (Petrol Bunk) కల్తీ పెట్రోలు విక్రయం కలకలం రేపింది. దీంతో గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. బంక్‌లో వాహనదారులు పెట్రోల్ కోట్టించుకోగా... పెట్రోల్‌లో నీళ్లు కలిసాయి. కొద్ది దూరం వెళ్లి.. వాహనాలు నిలిచిపోవడంతో బంక్ వద్దకు తిరిగి వచ్చి ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితం కూడా ఇదే విధంగా పెట్రోల్ కొట్టించుకుంటే నీళ్లు వచ్చాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేకసార్లు ఇదేవిధంగా జరిగినా అధికారులు చర్యలు చేపట్టలేదు. కల్తీ పెట్రోల్‌తో తమ వాహనాలు పాడవుతున్నాయని.. బంక్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా గుడివాడ, మల్లాయిపాలెం పరిధిలోని ముదినేపల్లి రోడ్డులో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సన్నిహితుడు షా కీర్తికుమార్ జీవావత్‌కు చెందిన షా గులాబ్‌చంద్ జీవావత్ అండ్ కో పెట్రోలు బంకులో కల్తీ పెట్రోలు విక్రయం కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం 50 మందికి పైగా బైక్‌లలో 75 లీటర్ల మేర పెట్రోలు కొట్టించుకున్నారు. కొద్దిదూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోయాయి. వాహనాలు స్టార్ట్ అవ్వలేదు. దీంతో బైక్‌లను బంకు వద్దకు తీసుకొచ్చి సిబ్బంది ఎదుట పెట్రోలు ట్యాంకులను తెరచి చూపించారు. కంపెనీ ప్రతినిధి తమ తప్పేం లేదని, పెట్రోలుతో పాటు ఇథనాల్ కలవకపోవడంతో వాహనాలు ఆగిపోతున్నాయని, బైక్‌కు ఏ ఇబ్బందీ ఉండదని 75 లీటర్ల పెట్రోలు అమ్మకాలు జరిగాయని, తిరిగి వచ్చిన వారందరికి పవర్ పెట్రోలును కొట్టించి పంపుతున్నట్లు తెలిపారు. మరికొందరు పాత ద్విచక్రవాహనదారులు వాహనం ఎందుకు ఆగిందో తెలియక మెకానిక్‌లను ఆశ్రయించారు. ట్యాంకు నుంచి పెట్రోలును తీసి కల్తీపెట్రోలు కారణంగానే ఆగిపోయాయని, నెలలో రెండోసారి వాహనాల ట్యాంకులను శుభ్రపరిచామని మెకానిక్‌లు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ
పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారు: యనమల
గీత కార్మికులకు నేడు కాటమయ్య రక్ష కిట్ల పింపిణి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 14 , 2024 | 09:19 AM