Home » Petrol Pumps
పెట్రోల్, డీజిల్ ధరలు కొన్నాళ్లుగా అలాగే స్థిరంగా ఉంటున్నాయి. ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదు. అయితే ధన త్రయోదశి సందర్భంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కీలకమైన ప్రకటన చేశాయి. పెట్రోల్ పంప్ డీలర్లకు చెల్లించే డీలర్ కమిషన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
ఇలా ఒకటీ, రెండూ కాదు... రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వాహనాలను పెట్రోల్, డీజిల్ కొరత పట్టి పీడిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... జిల్లాల్లో నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి.
కృష్ణాజిల్లా: మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సన్నిహితుడు, వైసీపీ నేత షా కీర్తికుమార్ జీవావత్‌కు చెందిన షా గులాబ్‌చంద్ జీవావత్ అండ్ కో పెట్రోలు బంకులో కల్తీ పెట్రోలు విక్రయం కలకలం రేపింది. దీంతో గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు.
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సన్నిహితుడు షా కీర్తికుమార్ జీవావత్‌కు చెందిన షా గులాబ్‌చంద్ జీవావత్ అండ్ కో పెట్రోలు బంకులో (Petrol Bunk) కల్తీ పెట్రోలు విక్రయం కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం 50 మందికి పైగా బైక్‌లలో 75 లీటర్ల మేర పెట్రోలు కొట్టించుకున్నారు..
బహుళ అంతస్తుల భవనాలు, గోడౌన్లు, పెట్రోల్ బంక్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, లేఅవుట్ ఏర్పాటు.. వీటీల్లో దేనికైనాసరే హెచ్ఎండీఏ ఇకపై ఆన్లైన్లోనే అనుమతులు జారీ చేయనుంది. కొన్ని అనుమతులు ఆన్లైన్లో మరికొన్ని అనుమతులు ఆఫ్‌లైన్‌లో జారీ చేసే గత విధానానికి పూర్తిగా స్వస్తి పలికింది.
చాలా మంది వాహనదారులకు ఇంధన వాడకం విషయంలో పలు రకాల సందేహాలు ఉంటాయి. బైక్(bike) లేదా కారు(car)లో ఫుల్ ట్యాంక్ ఇంధనం(fuel) నింపుకుంటే మంచి మైలేజీ వస్తుందా లేదా లీటర్ నింపుకోవాలా అనే సందేహం ఉంటుంది. అయితే అసలు విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
ఇబ్రహీంపట్నం, (ఎన్టీఆర్ జిల్లా): రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు దృష్టిలో పెట్టుకుని, ఇబ్రహీంపట్నంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండటంతో పెట్రోల్ బంక్‌లలో లూజ్ పెట్రోల్ పోయడాన్ని పోలీసులు నిలిపివేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల యాజమాన్యంతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు (AP Elections).. ఎన్నికల తర్వాత జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. దాడులు జరిగిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 144 సెక్షన్ పెట్టడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి..