ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati: అందంగా ముస్తాబవుతున్న అమరావతి

ABN, Publish Date - Aug 23 , 2024 | 01:44 PM

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం త్వరలోనే కొత్త అందాన్ని సంతరించుకోబోతోంది. జంగిల్ క్లియరెన్స్‌తో రూపురేకలు మారుతున్నాయి. కంప తొలగింపు పనులు దాదాపు 40 శాతం వరకు పూర్తి అయ్యాయి. గత ఐదేళ్లలో దట్టంగా పెరిగిన.. ముళ్లకంపలతో నిండిపోయి ఉన్న అమరావతి ప్రాంతం త్వరలోనే పూర్వకళ సంతరించుకోబోతోంది.

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి (AP Capital Amaravati ) ప్రాంతం త్వరలోనే కొత్త అందాన్ని సంతరించుకోబోతోంది. జంగిల్ క్లియరెన్స్‌ (Jungle Clearance)తో రూపురేకలు మారుతున్నాయి. కంప తొలగింపు పనులు దాదాపు 40 శాతం వరకు పూర్తి అయ్యాయి. గత ఐదేళ్లలో దట్టంగా పెరిగిన.. ముళ్లకంపలతో నిండిపోయి ఉన్న అమరావతి ప్రాంతం త్వరలోనే పూర్వకళ సంతరించుకోబోతోంది.


వైసీపీ (YCP) పాలనలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని అమరావతి జంగిల్ క్లియరెన్స్‌తో స్వచ్ఛంగా మారుతోంది. పునర్ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తొలి మెట్టుగా కంప తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 7న జంగిల్ క్లియరెన్స్ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. 24 వేల ఎకరాల్లో కంప తొలగింపు నెల రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 36.50 కోట్లతో మొదలైన పనులు రాజధాని గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఇది పూర్తి అయిన తర్వాత మౌలిక వసతుల కల్పనపై సీఆర్డీయే దృష్టి సారించనుంది. ఇప్పటి వరకు దాదాపు 10 వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి అయ్యాయి.


పనులు త్వరగా పూర్తి చేసేందుకు మొత్తం విస్తీర్ణాన్ని వంద డివిజన్లుగా విభజించారు. 250 ఎకరాలను ఒక డివిజన్‌గా విభజించారు. గుత్తేదారుకు చెందిన ప్రొక్లైన్లతోపాటు ప్రభుత్వ రైతులను కూడా ఇందులో భాగస్వాములను చేసింది. కంప తొలగింపులో పనులు చేసేందుకు ఆసక్తి ఉండి యంత్రాలు ఉన్నవారికి సీఆర్డీయే అధికారులు అవకాశం కల్పించారు. దీంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాజధాని నగరంలోని మందడం, వెలగపూడి, లింగాయపాలెం, రాయపూడి, పిచ్చుకల పాలెం,తుళ్లూరు, దొండపాడు, కొండమరాజుపాలెం, శాఖమూరు, అనంతవరం, వెంకటపాలెం, ఉద్ధండరాయునిపాలెం ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి.


జంగిల్ క్లియరెన్స్‌తో భవనాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న వీటికి వెళ్లాలంటే ఇప్పటి వరకు దట్టంగా పెరిగిన ముళ్లకంపలతో నిండిపోయి కష్టంగా ఉండేది. రైతులకు రిటనబుల్ ప్లాట్లలోనూ ఇదే పరిస్థితి. ఎవరి ప్లాట్ హద్దు ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు లై అవుట్‌లోకి వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించలేని పరిస్థితి ఉండేది. ఇప్పడు జంగిల్ క్లియరెన్స్‌తో అమరావతి ప్రాంతం త్వరలోనే పూర్వకళ సంతరించుకోబోతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి ఆలయం వద్ద గోల్డ్ మ్యాన్ల హల్చల్..

బయటపడ్డ వైసీపీ చెత్త బుద్ధి..

సీఎంల జాబితాలో టాప్-5లో చంద్రబాబు..

ప్రధాని మోదీపై రాహుల్ కామెంట్స్..

తమిళ రాజకీయాల్లోకి రోజా ఎంట్రీ..?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 23 , 2024 | 01:49 PM

Advertising
Advertising
<