ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: హీరో కార్తీకి పవన్ కల్యాణ్ వార్నింగ్

ABN, Publish Date - Sep 24 , 2024 | 11:29 AM

హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Andhra Pradesh Deputy CM Pawan Kalyan

తిరుమల లడ్డూ కల్తీ అంశం ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతోంది. ఈ అంశంపై సినీ హీరో కార్తీ (Karthi) చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. కార్తీ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని సూచించారు.


ఇదీ విషయం

హీరో కార్తీ సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. వేడుకలో యాంకర్ కార్తీతో మాట్లాడుతూ.. లడ్డూ కావాలా నాయనా అని అడిగారు. అందుకు కార్తీ స్పందిస్తూ.. లడ్డూ టాపిక్ వద్దని.. ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్ అని కామెంట్ చేశారు. లడ్డూ గురించి హీరో కార్తీ సెటైర్లు వేశారు. కార్తీ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు.



మరోసారి అనొద్దు

తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ.. లడ్డూ గురించి కామెంట్ చేయడం సరికాదు. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని హీరో కార్తీ అన్నారు. అలా అనడం కరెక్ట్ కాదు. కార్తీ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. మరోసారి కార్తీ అలా అనొద్దు. ఓ నటుడిగా కార్తీ అంటే నాకు గౌరవం. కానీ లడ్డూ విషయంలో చేసిన కామెంట్లు మాత్రం సరికాదు. సనాతన ధర్మాన్ని అందరూ గౌరవించాలి అని’ పవన్ కల్యాషన్ సూచించారు.



ఆలోచించి మాట్లాడండి

ఏ విషయం గురించి అయినా మాట్లాడేముందు వందసార్లు ఆలోచించాలని పవన్ కల్యాణ్ కోరారు. ఆచి తూచి మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ జరగడంతో కలత చెందిన పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్లను శుభ్ర పరిచారు. ఆ తర్వాత లడ్డూ విషయంలో చులకనగా మాట్లాడిన వారిపై మండిపడ్డారు. హీరో కార్తీతోపాటు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ లడ్డూను తక్కువ చేసి మాట్లాడారు. పంది కొవ్వు ధర ఎక్కువ.. దానిని ఆవు నెయ్యిలో ఎందుకు కలుపుతారని మాట్లాడారు. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా లడ్డూ వ్యవహారంపై స్పందించారు. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంపై ప్రకాశ్ రాజ్, పొన్నవోలు సుధాకర్, కార్తీ చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ తప్పు పట్టారు.

ఇవి కూడా చదవండి:

Tirumala Laddu Controversy: పొన్నవోలు, ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పవన్


మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 24 , 2024 | 11:42 AM