ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
ABN, Publish Date - Nov 18 , 2024 | 10:02 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర సమయం కొనసాగుతోంది. మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. నిరుపయోగంగా ఉన్న భూమలును పేదలకు అసైన్డ్ చేసిందని, గత ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు నిషిద్ద 22 ఏ నుండి 9 లక్షలకు పైచిలుకు తొలగించాలని చూసారన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly budget meetings) సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది (Question time continues). ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. అసైన్డ్ భూములు పేదల నుండి దోచేయడానికి ఎంతో ప్రయత్నం చేశారని, అసైన్డ్ భూమలు రూ. 5, రూ. 10 లక్షలకు తీసుకొని రూ. 40 , 45 లక్షలకు అమ్ముకున్నారన్నారు. పేదలు ఇవ్వనని ఎదురుతిరిగితే వారి భూములను రెడ్ మార్కులో పెట్టేశారని ఆరోపించారు.
మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. నిరుపయోగంగా ఉన్న భూమలును పేదలకు అసైన్డ్ చేసిందని, గత ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు నిషిద్ద 22 ఏ నుండి 9 లక్షలకు పైచిలుకు తొలగించాలని చూసారన్నారు. 1977 చట్టానికి సవరణ చేసి ఇప్పడు చట్టాన్ని తెచ్చారని, 20 ఏళ్లు పూర్తి అయిన అసైన్డ్ భూములకు 10 ఏళ్ళ ఇంటి స్ధలాలకు యాజమాన్య హక్కులు కల్పించారన్నారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాబందులు అక్కడికి వెళ్లి వారివద్దనుండి లాక్కున్నారని ఆరోపించారు. వారు ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. దీనిలో 25 వేల రిజిష్ట్రేషన్లు జరిగితే దానిలో 8 వేల రిజిష్ట్రేషన్లు అక్రమంగా చేసినట్టు సమాచారమన్నారు. 9 లక్షలు పైచిలుకు ఎసైన్డు భూమల్లో 40 శాతం ఇలా అక్రమంగా జరిగినట్టు తెలుస్తోందన్నారు. ఎసైన్‌మెంట్ దారులను బెదిరించి లాక్కోవడంతో పాటు కొర్రీలు లేకుండా రిజిష్ట్రేషన్‌ల శాఖ నుండి ఆదేశాలు ఇప్పించుకున్నారని ఆరోపించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తున్నామన్నారు. దోచుకున్న భూముల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. తప్పుచేసిన అధికారులకు కూడా ఈ వ్యవహరంలో పనిష్‌మెంట్ ఉంటుందని మంత్రి అనగాని హెచ్చరించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ మీ కోసం..
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ
ముషాయిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..
బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 18 , 2024 | 10:03 AM