AP Assembly Session: ఏపీ వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా
ABN, Publish Date - Nov 11 , 2024 | 10:53 AM
Andhrapradesh: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual keshav) ఈరోజు (సోమవారం) ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే రూ.43402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
అమరావతి, నవంబర్ 11: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual keshav) ఈరోజు (సోమవారం) ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే రూ.43402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం 2లక్షల 35వేల 916.99 కోట్ల రూపాయలు కాగా.. మూలధన వ్యయం 32 వేల 712.84 కోట్ల రూపాయలుగా మంత్రి వెల్లడించారు. రెవెన్యూ లోటు ఈ కాలానికి 34,743.38 కోట్ల రూపాయలు కాగా, ద్రవ్యలోటు 68 వేల 742.65 కోట్లు రూపాయాలుగా ప్రతిపాదించారు. రాష్ట్ర జీఎస్ డీపీలో రెవెన్యూలోటు 4.19శాతం గాను ద్రవ్యలోటు 2.12 శాతంగా ఉంటుదని అంచనా.
Rushikonda : రుషికొండ ఫైళ్లు మాయం!
గతంలో ఆర్థిక మంత్రిగా చంద్రబాబు నాయుడు కోట్ చేసిన పాయింట్లను ఈ సందర్భంగా సభలో మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. రేపటి రోజున దేశం చేసే ఆలోచనను ఏపీ నేడే చేస్తోందని చంద్రబాబు నాయుడు వల్లే వచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను శాశ్వత రాజధాని లేకుండా అన్యాయంగా విభజించారని... ప్రజలపై విభజనను రుద్దారన్నారు. 2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి రోజులు మొదలయ్యాయన్నారు. అన్ని రకాలుగా నాటి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని విమర్శించారు. సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే అని.. అది లేకపోతే వనరులు సమీకరణ కష్టమవుతుందని కౌటిల్యుని మాటలను కూడా ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు.
బడ్జెట్ కేటాయింపులు ఇవే..
రెవెన్యూ వ్యయం అంచనా - రూ.2.34 లక్షల కోట్లు
మూలధన వ్యయం అంచనా - రూ.32,712 కోట్లు
రెవెన్యూ లోటు - రూ.34,743 కోట్లు
ద్రవ్యలోటు - రూ.68,743 కోట్లు
జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం
సంక్షేమం - రూ.4376కోట్లు
మహిళ, శిశు సంక్షేమం - రూ.4285కోట్లు
మానవ వనరుల అభివృద్ధి - రూ. 1215కోట్లు
పాఠశాల విద్య - రూ. 29909కోట్లు
ఉన్నత విద్య - రూ.2326 కోట్లు
ఆరోగ్య రంగానికి - రూ.18421కోట్లు
పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి - రూ.16739 కోట్లు
పట్టణాభివృద్ధి - రూ.11490 కోట్లు
గృహనిర్మాణం - రూ. 4012కోట్లు
జలవనరులు - రూ.16705కోట్లు
పరిశ్రమలు వాణిజ్యం - రూ.3127కోట్లు
ఇంధన రంగం - రూ.8207కోట్లు
ఆర్ అండ్ బీ - రూ.9554కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక - రూ.322కోట్లు
పోలీస్ శాఖకు - రూ.8495 కోట్లు
ఎస్సీ సంక్షేమం - రూ.18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం - రూ.7,557 కోట్లు
బీసీ సంక్షేమం - రూ.39,007 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.4,376 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1215 కోట్లు
పర్యావరణం, అటవీశాఖ రూ.687 కోట్లు
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: ‘సూపర్ సిక్స్’కు ఊతం!
Rushikonda : రుషికొండ ఫైళ్లు మాయం!
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 11 , 2024 | 02:39 PM