AP Assembly: నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ABN, First Publish Date - 2024-02-08T07:48:53+05:30
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అలాగే మరో రెండు బిల్లులకు శాసన సభ ఆమోదం తెలపనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అలాగే మరో రెండు బిల్లులకు శాసన సభ ఆమోదం తెలపనుంది.
కాగా శాసనసభలో మంగళవారం నాటి సీనే బుధవారం కూడా రిపీట్ అయింది. పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే రైతు సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. పోడియంపైకి వెళ్లి ఆందోళన చేపట్టారు. ‘బైబై జగన్’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. కాగితాలను చించి విసిరేశారు. పోలవరం ప్రాజెక్టును కట్టలేని అసమర్థ ప్రభుత్వం.. కౌలు రైతులను, క్రాప్ ఇన్స్యూరెన్స్‌లను మర్చిపోయి.. క్రాప్ హాలిడే ఇస్తున్న ప్రభుత్వం.. ధాన్యం కొనుగోళ్లు, ఆక్వా రైతులను మోసం చేసిన జగన్‌రెడ్డి అప్పుల అప్పారావు.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ సభ్యుల నిరసన, నినాదాల మధ్యే మూడు బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది. అప్పటికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తుండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రతిపాదించారు. పది మంది ఎమ్మెల్యేలను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. మార్షల్స్ వచ్చి వారిని బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకువెళ్లారు. రైతులను ఆదుకోని ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.
బుధవారం ఉదయం సభ ప్రారంభంకాగానే రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్‌రెడ్డి, బీటీ నాయుడు తదితరులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దీన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. కాగా, మండలిలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రవేశపెట్టారు. ఇంకోవైపు.. ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ పే స్ట్రక్చర్ చట్టం 1994కి సవరణ బిల్లును ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఎన్‌ఎంఆర్/డెయిలీ వేజ్ వర్కర్లు తమను రెగ్యులరైజ్ చేయమని గాని, రెగ్యులరైజేషన్‌కి ముందు కాలానికి కూడా పెన్షన్ ఇవ్వమనిగాని కింది కోర్టులకు వెళ్లడానికి అవకాశం లేకుండా ఈ సవరణ ప్రతిపాదించింది.
Updated Date - 2024-02-08T07:48:54+05:30 IST