ABL Live..: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ABN, Publish Date - Nov 11 , 2024 | 10:50 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సారాల ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభముందు ఉంచుతున్నానని.. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమయిన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమని అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Meetings) సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ (Minister Paiyavula Keshav) ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సారాల ఏపీ వార్షిక బడ్జెట్‌ను (AP Annual Budget) సభముందు ఉంచుతున్నానని.. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమయిన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమని అన్నారు. రాష్ట్రంలోని వ్యవస్ధలను నిర్వీర్యం చేసి రాష్ట్రానికి గత ప్రభుత్వం చేసిన ద్రోహన్ని ఏడు స్వేత పత్రాల ద్వారా తెలియజేశామన్నారు. కేంద్ర పథకాల నిధులు మల్లింపు.. పిల్లల పౌష్టికాహరాన్ని అందించే పథకాల నిధులు కూడా మళ్ళింపు చేశారని, ఇంధన రంగ నిధులు మళ్ళింపు... ఇలాంటి పరిస్ధితుల వల్ల ఆర్ధిక గందరగోళ పరిస్ధితులు ఎదురయ్యాయని.. నేడు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ పతనం అంచున ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రాబాబు (CM Chandrababu) మాటలను మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. 57 శాతం ఓట్లతో 175 సీట్లకు గానూ 93 శాతం సీట్లు గెలిచామన్నారు. గత దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన విప్లవ సమాధానం ఈ ఫలితమని పయ్యవుల కేశవ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి..
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతికి నిధులపై త్రైపాక్షిక చర్చలు ..
కొత్త ప్యాలస్ నిర్మాణంలో ఆ ఇద్దరితే కీలక పాత్ర..
కార్తీక మాసం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 11 , 2024 | 10:50 AM