ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ABN Live: ఏపీ క్యాబినెట్ భేటీ.. ప్రత్యక్ష ప్రసారం..

ABN, Publish Date - Oct 23 , 2024 | 01:59 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 13 అంశాలపై ప్రధాన ఎజెండాగా భేటీ జరుగుతోంది. దీపావళి కానుకగా దీపం పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుంది.

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన బుధవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. మొత్తం 13 అంశాలపై ప్రధాన ఎజెండాగా కేబీనెట్ సమావేశం జరుగుతోంది. దీపావళి కానుకగా దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు రూ.25 సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిండర్ ధర రూ.851గా ఉంది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుంది. అదే ఐదేళ్ళకు కలిపి రూ.13వేల 423 కోట్ల అదనపు భారం అవుతుంది. దీని అమలుకు పూర్తి స్థాయిలో కేబినెట్‌లో సీఎం చంద్రబాబు మంత్రి మండలిలో దిశ నిర్దేశం చేస్తారు.

దీంతోపాటు గత ప్రభుత్వం విశాఖలో శారద పీఠానికి గత ప్రభుత్వం అక్రమంగా కేటాయించిన భూములను రద్దు చేసే అంశంపై కేబీనెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో వందకోట్లు పైబడి జ్యూడిషియల్ రివ్యూ ప్రివ్యూ కమిటీ ఏర్పాటు చేసింది. తర్వాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం.. ఇది మొత్తం ఓ విష సర్కిళ్లా ఈ అంశాన్ని తీసుకువచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం ఈ అంశంపై సమీక్షించి జ్యూడీషియల్ ప్రీవ్యూ కమిటీని రద్దు చేసే అవకాశముంది.


అలాగే రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా కేబినెట్‌లో ఉచిత ఇసుక పాలసీ అమలుపై చర్చ జరగనుంది. గత కేబినెట్‌లో ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేబినెట్ నాటికి పరిస్థితిలో మార్పు రావాలని.. ఎక్కడ ఇసుక దొరకడం లేదు... రేట్ ఎక్కువ అనే మాట వినపడకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఇసుక పాలసీ లక్ష్యం నెరవేరి తీరాలని గత కేబినెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా చెప్పారు. అలాగే సూపర్ 6 పథకాలు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు ఏ విధంగా లఅమలు అవుతున్నాయి. డ్రోన్ సమ్మిట్ అంశంతోపాటు పలు కీలకాంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఏబీఎన్ లైవ్ చూడండి..


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ: పర్యాటకులకు గుడ్ న్యూస్..

విద్యార్థులకు త్వరలో శుభవార్త: మంత్రి లోకేష్

అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చా ..: వాసిరెడ్డి పద్మ

డ్రోన్‌ భళా.. విన్యాసాలు అదుర్స్‌..

వరంగల్‌లో పొట్టేల్ సినిమా యూనిట్ సందడి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 23 , 2024 | 01:59 PM