ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: పైపులు వేశారు.. నీటిని మరిచారు.. వైసీపీపై పవన్ ఫైర్

ABN, Publish Date - Dec 18 , 2024 | 11:41 AM

Andhrapradesh: నేడు నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది అంటున్నారని.. నీరు దొరకని సమయాల్లో మనకు ఆ విలువ ఏమిటో తెలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పొలిటికల్‌గా ఆకాశం అంత పందిరి వేస్తాం అన్నట్లుగా హామీలు ఇస్తామని.. కానీ ఆచరణలో ఎన్నో‌ సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉందన్నారు.

Deputy CM Pawan Kalyan

విజయవాడ, డిసెంబర్ 18: జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన ‌మంచినీరు అందించాలనేది లక్ష్యమన్నారు. 2019 ఆగష్టులో‌ ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికే పరిమితం అయ్యిందని.. 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజూ నీటి సరఫరా చేయాలన్నారు. 55 ‌లీటర్లు ఒక మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మోడీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు.

TDP: టీడీపీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్


నీటి విలువ తెలిసేది అప్పుడే..

నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చూస్తున్నామని.. అమృతధార ద్వారా లోపాలు, ఇబ్బందులు సరి‌చేసి మంచినీటిని అందిస్తామన్నారు. నేడు నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది అంటున్నారని.. నీరు దొరకని సమయాల్లో మనకు ఆ విలువ ఏమిటో తెలుస్తుందన్నారు. పొలిటికల్‌గా ఆకాశం అంత పందిరి వేస్తాం అన్నట్లుగా హామీలు ఇస్తామని.. కానీ ఆచరణలో ఎన్నో‌ సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉందన్నారు. భీష్మ ఏకాదశిన 24 గంటలు మంచి నీళ్లు తాగకుండా ఉంటే ఆ ఇబ్బంది తెలుస్తుందన్నారు.


రూ. 4వేల కోట్లను...

‘‘నేను ఈ శాఖ మంత్రిగా రివ్యూ చేస్తే... అనేక లోపాలు తెలిశాయి. ఈ పధకం అమలుకు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా లక్ష కోట్ల నుంచి 30 వేల కోట్ల వరకు అడిగారు. కేరళ‌ 46 వేల కోట్లు అడిగితే.. మన ఏపీ మాత్రం 26 కోట్లే అడిగింది. మన రాష్ట్ర వాటా కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల జల జీవన్ మిషన్ అమలు కాలేదు. నేను కేంద్ర పెద్దలతో మాట్లాడితే వారు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి చెప్పారు. నాలుగు వేల కోట్లను సద్వినియోగం చేయలేక పోయింది. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు‌ విరుద్ధంగా పని చేశారు. నీరు ఎలా తెస్తారో చూడకుండా పైపులు మాత్రం వేశారు. రిజర్వాయర్‌ల ద్వారా నీటిని తీసుకోవాల్సి ఉండగా.. వాటిపై దృష్టి పెట్టలేదు’’ అని విమర్శించారు.


నీటి సరఫరాపై దృష్టి...

కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయకత్వంలో ఈ నీటి సరఫరాపై దృష్టి పెట్టామన్నారు. సీఆర్‌ పాటిల్ దగ్గర కూడా మన రాష్ట్రానికి రూ.76 కోట్లు‌ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఆ ప్రాజెక్టు వివరాలు మొత్తం నివేదిక సిద్ధం చేసి జలశక్తి మంత్రికి అందజేయనున్నట్లు చెప్పారు. ‘‘పని చేయాలనే తపన ఉన్న అధికారులు మన రాష్ట్రంలో ఉన్నారు. నేను ఎక్కడకి వెళ్లినా పైపులు వేశారు.. నీళ్లు రావడం లేదని ఫిర్యాదులు చేశారు. గత ప్రభుత్వం 70.40 లక్షల గృహాలకు ఇచ్చినట్లు చెప్పారు. దీని‌పై పల్స్ సర్వే చేస్తే 55.30 లక్షల మందికి మాత్రమే నీటి కుళాయిలు పెట్టినట్లు తేలిందన్నారు. ప్రతి జిల్లాలో నీటి సరఫరాకు ఉన్న ఇబ్బందులు, వనరులు తెలుసుకునేందుకు ఈ వర్కు షాపు ఏర్పాటు చేశాం. మోడీ కలలను సాకారం చేసేలా ప్రతి ఇంటికి మంచి నీరు అందించాలి. ప్రతి వ్యక్తికి 55 లీటర్లు ఇచ్చేలా జల జీవన్ మిషన్ ద్వారా పనులు చేయండి. మానవతా దృక్పధంతో అందరూ కలిసి పని‌చేయాలి. పైపు లైన్లు డిజైన్‌లు కూడా గందరగోళంగా ఉన్నాయి. గొయ్యి తవ్వి పైప్ లైన్ వేయడం తప్ప.. నీటి సరఫరాపై గత పాలకులు దృష్టి పెట్టలేదు. వీటికి శాశ్వతమైన పరిష్కారం చూడాలి... తాగునీటిని అందించాలి’’ అని అన్నారు.


ఇంత ఖర్చు పెట్టినా....

అదిలాబాద్, పిఠాపురం వంటి ప్రాంతాలలో కూడా నీరు అందని పరిస్థితి ఉందన్నారు. చుక్క చుక్క వస్తే ఒక పూటకి బిందె నిండుతుందన్నారు. ఇంజనీరింగ్ అధికారులు కూడా నీటిధార .. వచ్చేలా చూడాలన్నారు. ఇంత ఖర్చు పెడుతున్నాం... అయినా ప్రయోజనం లేకపోతే బాధ కలుగుతుందన్నారు. కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. రేపు జనవరికి అయిపోయే ఈ ప్రాజెక్టును పొడిగించి నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో కనీసం పాడైపోయిన పైపు లైన్‌లను కూడా క్లీన్ చేయలేదన్నారు. అమృత ధార కింద ఈ‌ స్కీం అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నామన్నారు.


అదే నా ఆశ

‘‘మీరు మనసు పెట్టి .. లక్ష్యాలను సాధించేలా సహకరించాలని నేను కోరుతున్నాను. ఈ‌ వర్కు షాపు ద్వారా అన్ని జిల్లాల్లో మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాను’’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవరెడ్డి పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

పీటల మీద నిలిచిన ఐపీఎస్ వివాహం.. వధువు తల్లికి గుండెపోటు

వాళ్ల పెన్షన్లు రద్దు.. నోటీసులు జారీ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 11:47 AM