AP Assembly: అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...
ABN, Publish Date - Nov 14 , 2024 | 08:21 AM
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు ఎన్నిక లాంఛనంగా స్పీకర్ అయ్యన పాత్రుడు... ప్రకటించనున్నారు. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పాలసీలకు మంత్రులు సభలో స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Meetings) గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. అనంతరం ప్రభుత్వం సభలో ఐదు బిల్లులు (5 Amendment Bills) ప్రవేశపెట్టనుంది. ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు - 2024..., ఏపీ ఎలక్ట్రసిటీ డ్యూటీ బిల్లు - 2024., ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు - 2024., ఆంధ్ర ప్రదేశ్ ఆయుర్వేదిక్, హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ బిల్లు - 2024., ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు - 2024. తదితన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.
కాగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు ఎన్నిక లాంఛనంగా స్పీకర్ అయ్యన పాత్రుడు... ప్రకటించనున్నారు. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పాలసీలకు మంత్రులు సభలో స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. 1. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ (MSME) డెవలప్‌మెంట్ పాలసీ 2024 - 29., 2. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ 2024 - 29., 3. ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ ప్రాససింగ్ పాలసీ 2024 - 29., 4. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రయివేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024 - 29.. దీనిపై మంత్రి టి జీ భరత్ సభలో స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సభాపతి పదవికి కూటమి అభ్యర్థిగా ఆయన పేరును మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పదవికి రఘురామ పేరును ప్రతిపాదిస్తూ టీడీపీ తరఫున మంత్రి లోకేశ్, జనసేన తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు సంతకాలు చేశారు. ఈ కాపీలతో కూడిన మూడు సెట్ల నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరకు సాయంత్రం 4.30 గంటలకు రఘురామకృష్ణరాజు అందించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ గడువు ముసిసేలోగా.. రఘురామ తప్ప మరెవ్వరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఉప సభాపతిఏకగ్రీవ ఎన్నికను గురువారం శాసనసభలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించే అవకాశం ఉంది.
అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్ సందడి..
ఉప సభాపతిగా తన పేరు ఖరారు కావడంతో రఘురామకృష్ణరాజు బుధవారం అసెంబ్లీలో సందడి చేశారు. ఆయనకు కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అభినందనలు తెలిపారు. ఉపసభాపతికి అసెంబ్లీ అధికారులు కేటాయించిన చాంబర్‌ను స్వయంగా రఘురామకృష్ణరాజు పరిశీలించి చిన్న చిన్న మార్పులు సూచించారు. గురువారం మధ్యాహ్నం 2.39 గంటలకు డిప్యూటీ స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ట్రాఫిక్ ఏసీపీ..
లగచర్ల దాడిలో.. కేటీఆర్ ప్రమేయం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 14 , 2024 | 08:22 AM