ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Moshen Raju: తిరుమల లడ్డు వివాదంపై ఏపీ శాసనమండలి చైర్మన్ స్పందన

ABN, Publish Date - Sep 24 , 2024 | 04:51 PM

Telangana: తిరుపతి లడ్డు కల్తీపై తాను కూడా సీబీఐ విచారణ కోరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డు కల్తీ జరిగిందని చెప్పారని.. తిరుపతి లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

koyya moshen Raju

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: తిరుపతి లడ్డు (Tirumala Laddu) వివాదంపై ఏపీ శాసనమండలి ఛైర్మన్ కొయ్య మోషేను రాజు (AP Legislative Council Chairman koyya moshen raju) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి లడ్డు కల్తీపై తాను కూడా సీబీఐ విచారణ కోరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) లడ్డు కల్తీ జరిగిందని చెప్పారని.. తిరుపతి లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. నిజంగా కల్తీ జరిగిందని తేలితే దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సహితం కూడా కోర్టుకు వెళ్లాయన్నారు. నిజాలు వాస్తవాలు బయటకు రావాలని.. దేవుడి దగ్గర జరిగిన నిజాలు ప్రజలకు తెలియాలని మోషేను రాజు పేర్కొన్నారు.

Ganta: అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ.. పాల్గొన్న గంటా


లోక్‌సభ స్పీకర్ నేతృత్వంలో..

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఢిల్లీలో రెండు రోజుల పాటు కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ రీజియన్ సదస్సు జరిగిందని మోషేను రాజు తెలిపారు. సదస్సుకు అన్ని రాష్ట్రాల స్పీకర్లు, శాసనమండలి చైర్మన్లు హాజరయ్యారన్నారు. కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ రీజియన్ సదస్సు అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగనుందని.. దానికి ముందుగా స్పీకర్ ఓం బిర్లా ఒక సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు. సమగ్ర అభివృద్ధి, కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం వంటి అంశాలపై చర్చ జరిగిందన్నారు. శాసన సభ, శాసన మండలి నిర్వహణ మెరిట్, డి మెరిట్‌పై చర్చ జరిగిందన్నారు.


ప్రజలకు కింది స్థాయి వరకు మెరుగైన అభివృద్ధి అందాలనే అంశంపై చర్చ జరిగినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి ఏపీ అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. పరిశ్రమలు అన్ని హైదరాబాద్‌లో ఉండడం వలన ఏపీ వెనకబడిపోయిందని చెప్పారు. ప్రత్యేక హోదా రాలేదని... రాష్టానికి రావాల్సిన ఇతర అంశాలపై ఏపీ అభివృద్ధి వెనకబడిపోయిందన్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఏపీ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

V Hanumantha Rao: వైఎస్ జగన్‌కి వీహెచ్ కీలక సూచన


గత పదేళ్లుగా రాజధాని లేకపోవడంతో కొంచం అభివృద్ధికి అటకం కలిగిందన్నారు. సభాపతులకు, శాసన మండలి చైర్మన్లు బడ్జెట్ ఖర్చు పెట్టే అధికారాలు ఉండాలన్నారు. సమావేశంలో కూడా అందరూ ఇదే అంశాన్ని లేవనెత్తారన్నారు. శాసన సభ, శాసన మండలి 60 రోజుల పాటు జరగాలని సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. రాష్టానికి రావాల్సిన నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని ఏపీ శాసనమండలి ఛైర్మన్ కొయ్య మోషేను రాజు వినతి చేశారు.


ఇవి కూడా చదవండి..

Narayana: కల్తీ నెయ్యికి ప్రధాన కారకుడు జగనే..

Anam RamnarayanaReddy: టీటీడీ పాలకమండలి నియామకం ఎప్పుడో చెప్పిన మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2024 | 04:56 PM