ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Ministers: రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శం.. ఏపీ మంత్రులు

ABN, Publish Date - Oct 10 , 2024 | 12:37 PM

Andhrapradesh: రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన అదర్శవాది రతన్ టాటా అని తెలిపారు. రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శమన్నారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో రతన్ టాటా సేవలు అద్వితీయమని కొనియాడారు.

AP Ministers condolence death of Ratan Tata

అమరావతి, అక్టోబర్ 10: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా (Ratana Tata) మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సహా మంత్రులు సంతాపం తెలిపారు. అలాగే ఏపీ కేబినెట్‌లో కూడా రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలియజేశారు. రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) అన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన అదర్శవాది రతన్ టాటా అని తెలిపారు. రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శమన్నారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో రతన్ టాటా సేవలు అద్వితీయమని కొనియాడారు. కేవలం మన దేశంలోనే కాకుండా 100కు పైగా దేశాల్లో అనేక పరిశ్రమలు స్థాపించి అనేకమందికి ఉపాధి చూపించారన్నారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.

Bathukamma: బతుకమ్మ వేడుకలకు ఆ ప్రాంతం ముస్తాబు


ఈ దేశం గొప్ప మానవతావాదిని కోల్పోయింది: కొండపల్లి శ్రీనివాస్

రతన్ టాటా మృతి పట్ల రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, ఈ దేశానికి తీరని లోటన్నారు. ఆయన గురించి తెల్సుకోవాల్సినది చాలా ఉంది. ఈ దేశం గొప్ప మానవతావాదిరని కోల్పోయిందన్నారు. విలువలకు నిలువుటద్దం రతన్ టాటా అని... ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని చెప్పుకొచ్చారు. పుట్టుకతో కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగిగించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని కొనియాడారు. ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.


రతన్ టాటా జీవితం యువతకు మార్గదర్శకం: బీసీ జనార్ధన్

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంపై రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణం దేశానికి, పారిశ్రామిక రంగానికి తీరని లోటన్నారు. విలువలు, విశ్వసనీయత, మానవత్వం కలబోసిన మహానీయుడు రతన్ టాటా అని.. ఆదర్శప్రాయుడైన రతన్ టాటా జీవితం యువతకు మార్గదర్శకం, అనుసరణీయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అని మంత్రి బీసీ జానర్థన్ అన్నారు.

Ratan Tata: రతన్ టాటా జీవితంలో థ్రిల్లింగ్ క్షణాలు! ఎన్నో ఏళ్ల కల నెరవేరిన వేళ..


మంత్రి సవిత దిగ్భ్రాంతి..

దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రతన్ టాటా వెన్నుముక అని కొనియాడారు. లాభాపేక్ష లేకుండా ఎన్నో పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ విప్లవం సృష్టించిన పారిశ్రామిక వేత్త అని, దేశం కోసం... ప్రజల కోసం... పనిచేసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అని.. సేవా కార్యక్రమాల్లోనూ రతన్ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని, రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి సవిత వ్యాఖ్యానించారు.


దాతృత్వంలో రతన్ టాటాకు సాటిలేరెవ్వరూ: మంత్రి దుర్గేష్

పారిశ్రామిక రంగంతో పాటు సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతిపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు. భారత పారిశ్రామిక రంగానికి దశ దిశ చూపించి నవతరం పారిశ్రామిక వేత్తలకు ఆదర్శప్రాయులైన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని వెల్లడించారు. పారిశ్రామిక రంగానికి మానవత్వం జోడించి పేద ప్రజల సంక్షేమాన్ని ఆలోచించిన మానవతావాది రతన్ టాటా అని కీర్తించారు. దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆజన్మాంతం ఆచరించిన మహనీయులు రతన్ టాటా అని అన్నారు. దాతృత్వంలో రతన్ టాటాకు ఎవరూ సాటిరారని.. కరోనా సంక్షోభ సమయంలో ఆయన వ్యవహరించిన విధానం, అత్యవసరంగా స్పందించిన తీరు, ఖర్చు చేసిన సొమ్ము వెలకట్టలేనిదన్నారు. రతన్ టాటా మరణం దేశానికి, పారిశ్రామిక రంగానికి తీరని లోటుగా వర్ణించారు. రతన్ టాటా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రార్థించారు.


ఏపీ ప్రజలతో మంచి అనుబంధం: పయ్యావుల

దేశ నిర్మాణంలో కీలక భాగస్వామి రతన్ టాటాకు గౌరవ సూచకంగా ఏపీ కేబినెట్ నివాళులు అర్పించిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉప్పు నుంచి ఉక్కు దాకా ఆయన పరిశ్రమలు స్థాపించి లక్షలాది మందికి ఉపాధి కల్పించారన్నారు. ఏపీ ప్రజలతోనూ ఆయనకు మంచి అనుబంధం ఉందన్నారు. సామాజిక బాధ్యతగా టాటా సంస్థలు ఏపీ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాయన్నారు. రతన్ టాటా మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కేబినెట్‌ను వాయిదా వేశామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Ratan Tata: రతన్ టాటా విజయ రహస్యాలు ఇవే..

CM Chandrababu: ప్రత్యేక విమానంలో ముంబైకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 10 , 2024 | 12:48 PM