ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: సైకోలను ఇరగదీయండి

ABN, Publish Date - Nov 07 , 2024 | 07:59 PM

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి సూచించారు. వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి పై తాను గతంలోనే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అమరావతి, నవంబర్ 07: సోషల్ మీడియా.. సమాజ హితాన్ని కాంక్షిస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. అలాంటి సోషల్ మీడియాను కొంత మంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్చ నీచం లేకుండా భ్రష్టు పట్టించారని ఆమె మండిపడ్డారు. మావన సంబంధాలు, రక్త సంబంధాలను సైతం మరిచి మృగాలుగా మారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, చెల్లి, అక్కా కూడా సాటి మహిళలే అనే కనీస ఇంగితం వారికి లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో వారంతా ఓ విధమైన రాక్షస ఆనందం పొందారని చెప్పారు. సోషల్ సైకోల బాధితుల్లో తాను ఒకరినని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Also Read: పుట్టగొడుగులు తినడం వల్ల ఇన్ని లాభాలా..?


వైఎస్ రాజశేఖరరెడ్డికే పుట్టలేదన్నారు..

అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అలాంటి పోస్టులు పెట్టీ.. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన మీద.. తన కన్నతల్లి మీద.. చిన్నాన్న కుమార్తె వైఎస్ సునీతపై విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గుర్తు చేసుకున్నారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికే పుట్టలేదంటూ సోషల్ మీడియాలో అవమానించారని తెలిపారు.

Also Read: రోజమ్మ నీకో న్యాయం..మాకో న్యాయమా ..!


వర్రా రవీందర్ రెడ్డి బాధితురాలినే..

తన ఇంటి పేరు మార్చి శునకానందం పొందారని సైకోలపై వైఎస్ షర్మిల ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై తాను సైతం గతంలో పోలీస్ కేసు పెట్టిన విషయాన్ని ఈ సందర్బంగా వైఎస్ షర్మిల వివరించారు. అటువంటి సైకోను ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు.

Also Read: రేవంత్ ఉడుత ఊపులకు అదర బెదర


పోస్ట్ పెట్టాలంటే.. భయపడాలి..

అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా.. వారి అంతు చూడాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వానికి వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడాలంటే భయపడేలా వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఉండాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్ష పార్టీలైన @JaiTDP @JanaSenaParty @BJP4Andhra‌కు వైఎస్ షర్మిల సూచించారు. ఈ మేరకు వైఎస్ షర్మిల తన ఎక్స్ ఖాతా వేదికగా గురువారం ఈ విధంగా స్పందించారు.

Also Read: వైసీపీ సైకోలకు సీఎం చంద్రబాబు వార్నింగ్


గతంలో జరిగింది ఇదీ..

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ సీనియర్ నేత వంగలపూడి అనితతోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా వైసీపీలోని సోషల్ మీడియా విభాగంలోని పలువురు తీవ్ర అభ్యంతరకర పోస్టులు చేశారు. అలాగే వైఎస్ జగన్ కన్నతల్లి వైఎస్ విజయమ్మ, సోదరిలు వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై ఇదే తరహాలో పోస్టులు సైతం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై గతంలో రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.

Also Read: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు


వైఎస్ అవినాశ్ రెడ్డి జోక్యంతో..!

ఈ వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. దీంతో మంగళవారం అతడిని కడపలోని చిన్న చౌక్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంతలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోన్నారని సమాచారం. దీంతో వర్రా రవీందర్ రెడ్డిని విడిచి పెట్టారని తెలుస్తుంది. అయితే అప్పటికే అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రొద్దుటూరు పోలీసులు చిన్న చౌక్ పీఎస్‌కు చేరుకున్నారు. కానీ రవీందర్ రెడ్డిని విడుదల చేయడంతో.. వారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దాంతో ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ అయింది. అందులోభాగంగా కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతోపాటు చిన్న చౌక్ పీఎస్ సీఐపై బదిలీ వేటు వేశారు.

Also Read: Teenmar Mallanna: ఎన్నికల్లో చిచ్చు పెట్టేందుకే..


స్పందించిన మాజీ సీఎం జగన్

ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా తన పార్టీకి చెందిన వారిని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారని ఆరోపిస్తూ.. అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడిన కొన్ని గంటలకే ఆయన సోదరి వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. అంతేకాదు... వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి వల్ల తాను సైతం బాధితురాలిగా మారని విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేయడం గమనార్హం.

For AndhraPradesh News And Telugu News..

Updated Date - Nov 07 , 2024 | 08:15 PM