Konakalla: ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష తప్పదు
ABN, Publish Date - Nov 12 , 2024 | 10:39 AM
Andhrapradesh: రాజకీయాలతో సంబంధం లేని మహిళలపై కూడా పోస్టులు పెట్టారని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆనాడు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న జాషువా తెలుగుదేశం పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు.
కృష్ణా, నవంబర్ 12: వైసీపీ సోషల్ మీడియా పోస్టులపై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ (RTC Chairman Konakalla Narayana) ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు షర్మిల, విజయలక్ష్మిపైనా నీచమైన పోస్టులు పెట్టారని మండిపడ్డారు. గతంలో పోలీసులను అడ్డం పెట్టుకుని బాధితులపైనే అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా పోలీసులపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ .. సజ్జల భార్గవ రెడ్డి కలిసే అందరితో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయించిందే జగన్ అంటూ విమర్శించారు.
AP NEWS: వేట మొదలైంది.. సోషల్ మీడియా సైకోల భరతం పడుతున్న పోలీసులు
రాజకీయాలతో సంబంధం లేని మహిళలపై కూడా పోస్టులు పెట్టారన్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆనాడు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న జాషువా తెలుగుదేశం పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జాషువా వంటి వారు చట్ట విరుద్ధంగా వ్యవహరించారన్నారు. ఇటువంటి పోలీసులను కూడా వదిలేది లేదని.. తప్పకుండా ప్రభుత్వం విచారించి చట్టపరంగానే చర్యలు తీసుకుంటారని తెలిపారు. పోస్టులు పెట్టిన వారితో పాటు ఆరోజు వారికి అండగా ఉన్న పోలీసులను కూడా ఉపేక్షించేది లేదన్నారు.
Cybercriminals: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. కాజేసిన డబ్బు అమాయకుల ఖాతాలకు..
ముంబై నటి జెత్వానీ జీవితాన్నే నాశనం చేయడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు వైసీపీ నాయకులుగా పని చేశారన్నారు. ముగ్గురు ఐపీఎస్‌లు ఒక అమ్మాయిని వేధించిన కేసులో సస్పెండ్ అయ్యారంటే ఎంత అవమానమన్నారు. పోలీసులైనా, రాజకీయ నాయకులైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాల్సిందే అని కొన్నకళ్ల నారాయణ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Cybercriminals: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. కాజేసిన డబ్బు అమాయకుల ఖాతాలకు..
BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
Read Latest AP News And Telangana News
Updated Date - Nov 12 , 2024 | 11:34 AM