అరుణ వర్ణ శోభితం
ABN, Publish Date - Dec 24 , 2024 | 12:51 AM
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు సోమవారం మూడో రోజు కూడా ఘనంగా జరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి భవానీలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
భవానీల రాకతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి
వన్‌టౌన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) ః ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు సోమవారం మూడో రోజు కూడా ఘనంగా జరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి భవానీలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఉత్సవాల ముగింపు ఉండటంతో తండోపతండాలుగా వస్తున్నారు. రైళ్లు, బస్సులతో పాటు కాలినడకన వస్తున్న భవానీలతో ఇంద్రకీలాద్రి అరుణవర్ణాన్ని పులుముకుంది. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భవానీలు గిరిప్రదక్షిణ చేసి దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారు. అనంతరం దీక్షను విరమిస్తున్నారు. కాగా, రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు.
Updated Date - Dec 24 , 2024 | 12:51 AM