Election Campaign: కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..
ABN, Publish Date - Apr 17 , 2024 | 07:45 AM
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కల్యాణ్ బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు.
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం (Election Campaign) ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం (TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవణ్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ప్రజాగళం (Prajagalam) ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడన (Pedala), మచిలీపట్నం (Machilipatnam)లో రోడ్డు షో (Road Show), బహిరంగ సభలు (Meetings) నిర్వహిస్తారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు బుధవారం సాయంత్రం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి పెడనకు ప్రత్యక హెలికాప్టర్‌లో రానున్నారు. నాలుగు గంటలకు పెడన బస్ స్టాండ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మచిలీపట్నంకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మచిలీపట్నంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో ప్రజాగళం సభ జరగనుంది. స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఈ సభ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో వారాహి విజయభేరి సభ జరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భద్రాచలం రామాలయంలో నేడు సీతారాముల కళ్యాణం
జగన్‌పాలనలో రాష్ట్రాభివృద్ధి గుండు సున్నా..!
మీరు అమాయకులేం కాదు
29 మంది నక్సల్స్ మృతి
Updated Date - Apr 17 , 2024 | 07:45 AM