Share News

CM Chandrababu: పరిశ్రమల కోసం నానా తంటాలు పడుతున్నాం.. మీరూ సీరియస్‌గా తీసుకోండి

ABN , Publish Date - Dec 12 , 2024 | 12:54 PM

Andhrapradesh: అమరావతి తరహాలోనే రైతులను పరిశ్రమలకు భూములిచ్చే అంశంలో భాగస్వాములను చేయాల్సిందిగా అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. వివిధ రంగాల్లో ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలను ఎన్యుమరేషన్ చేయించే పని త్వరితగతిన పూర్తి కావాలని సూచించారు.

CM Chandrababu:  పరిశ్రమల కోసం నానా తంటాలు పడుతున్నాం.. మీరూ సీరియస్‌గా తీసుకోండి
CM Chandrababu Naidu

అమరావతి, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu) అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. ఇందులో భాగంగా పరిశ్రమల శాఖపై ఆ శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎంతమంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించారన్నది ముఖ్యమని వ్యాఖ్యానించారు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని వెల్లడించారు. భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వాములను చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమ, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని పేర్కొన్నారు.

రైతుల కోసం అదిరిపోయే కొత్త స్కీమ్


రైతులను భాగస్వాములను చేయండి...

అమరావతి తరహాలోనే రైతులను పరిశ్రమలకు భూములిచ్చే అంశంలో భాగస్వాములను చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. వివిధ రంగాల్లో ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలను ఎన్యుమరేషన్ చేయించే పని త్వరితగతిన పూర్తి కావాలని సూచించారు. ఒక పరిశ్రమ తయారు చేసిన ఉత్పత్తి మరో పరిశ్రమకు ముడి సరుకు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.


ఆ విషయంలో చర్యలు తీసుకోండి: లోకేష్

20 లక్షల ఉద్యోగాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారని మంత్రి లోకేష్ అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలోనూ చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ప్రతీ పెట్టుబడి విషయంలోనూ కలెక్టర్లు జాగ్రత్తగా డీల్ చేయాలన్నారు. ఆర్సెలార్ మిట్టల్‌కు ఎన్ఎండీసీ ముడి ఇనుము ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని.. పైప్ లైన్ ద్వారా ముడి ఇనుము ఖనిజం వచ్చేలా చేయాలని కోరుతున్నారని లోకేష్ తెలిపారు.ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం ఉక్కుమంత్రికి, ఎన్ఎండీసీకి స్వయంగా నేనే ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తున్నాని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కలెక్టర్లు కూడా పెట్టుబడుల విషయంలో ఇదే తరహాలో సీరియస్‌గా ఫాలోఅప్ చేయాలని సూచించారు. ‘‘నేను మంత్రిని, కలెక్టర్‌ను అంతా నా దగ్గరకే రావాలన్న ఆలోచన వదిలేయాలి’’ అని సీఎం సూచించారు.

అందుకే రాజీనామా చేశా..


అందుకే పదేపదే చెబుతున్నా..

గత ప్రభుత్వ హయాంలో పెట్టిన ఇబ్బందుల కారణంగా ఏపీకి మళ్లీ రాబోమని వెళ్లిపోయారని దాన్ని సరిదిద్దేందుకు నానా తంటాలు పడుతున్నామని సీఎం వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు ఆలస్యమైతే వారికి వయబిలిటీ విషయంలో ఇబ్బందులు వస్తాయని ఆ కారణంగా ఇతర రాష్ట్రాలవైపు వారు చూసే అవకాశం ఉందన్నారు. అందుకే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై పదేపదే చెబుతున్నట్టు వెల్లడించారు. పర్యాటకం కూడా ఉపాధి కల్పనలో కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

YSRCP: వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి జంప్..

Avanti Srinivas: వైసీపీకి రాజీనామాపై అవంతి క్లారిటీ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 12 , 2024 | 01:35 PM