CM Chandrababu: ఏలూరు పోలీసులకు చంద్రబాబు అభినందనలు
ABN, Publish Date - Nov 09 , 2024 | 10:45 AM
Andhrapradesh: ఏలూరుకు చెందిన అలివేణి అనే మహిళకు చెందిన స్కూటీ దొంగలించబడింది. అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు దొంగలించబడిన స్కూటీని కనుగొన్నారు. వెంటనే స్కూటీ యజమానురాలు అలివేణికి సమాచారం అందించారు. హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సదరు మహిళ.. తన వాహనాన్ని అక్కడ చూసి భావోద్వేగానికి గురయ్యారు.
అమరావతి, నవంబర్ 9: ఏలూరు పోలీసులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అభినందించారు. దొంగలించబడిన వాహనాలను రికవరీ చేయడంలో ఏలూరు పోలీసులు తీవ్రంగా కృషి చేశారన్నారు. దొంగతనానికి పాల్పడిన నిందితులను పట్టుకుని దొంగలించబడిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. దాదాపు 25 మంది దొంగలను ఏలూరు పోలీసులు పట్టుకోవడం సంతోషకరమన్నారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం హర్షనీయమన్నారు. తమ వాహనాలను పోగొట్టుకున్న వారికి తిరిగి వాటిని అప్పగించడంలో పోలీసులు ఎంతో శ్రమించారని కొనియాడారు. ఈ సందర్భంగా దొంగలించబడిన ఓ మహిళ స్కూటీని తిరిగి ఆమెకు అప్పగిస్తున్న ఘటనను వివరిస్తూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.
Hyderabad: ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్ వద్ద అనుకోని ఘటన.. భయంతో జనం పరుగులు
ఏలూరుకు చెందిన అలివేణి అనే మహిళకు చెందిన స్కూటీ దొంగలించబడింది. అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు దొంగలించబడిన స్కూటీని కనుగొన్నారు. వెంటనే స్కూటీ యజమానురాలు అలివేణికి సమాచారం అందించారు. హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సదరు మహిళ.. తన వాహనాన్ని అక్కడ చూసి భావోద్వేగానికి గురయ్యారు. పోగొట్టుకున్న బైక్ తిరిగి రావడంతో ఒక్కసారిగా ఉద్విగ్నతకు లోనయ్యారు అలివేణి. కష్టపడి డబ్బులు కూడబెట్టి మరీ కొనుక్కున తన వాహనం దొంగలించబటంతో ఎంతో ఆవేదనకు గురైనట్లు ఈ సందర్భంగా మహిళ అన్నారు. అసలు వాహనం తిరిగి తన వద్దకు వస్తుందా లేదా అని ఆందోళన చెందినట్లు తెలిపారు. కానీ చివరకు పోలీసులు తన స్కూటీని కొనుగొని తిరిగి తనకు అప్పగించడంతో ఆనందంగా ఉందన్నారు. పోలీస్‌స్టేషన్‌లో తన స్కూటీ కనిపించగానే ఉద్వేగానికి గురైన మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..
మహిళ అలివేణికి తలసేమియాతో బాధపడుతున్న కుమార్తె ఉంది. ఈ క్రమంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు స్కూటీని ఉపయోగిస్తుంది అలివేణి. అయితే ఉన్నట్టుండి తన స్కూటీని దుండగులు అపహరించడంతో తీవ్ర ఆవేదన చెందారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్కూటీని పట్టుకుని అలివేణికి అప్పగించారు. దీంతో పోయిన స్కూటీ తిరిగి రావడంతో ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. అలాగే అలివేణికి చెందిన స్కూటీతో పాటు మరో 251 బైక్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాదాపు 25 మంది దొంగలను పట్టుకుని జైలుకు తరలించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగతనానికి గురైన బైక్‌ల యజమానుల వివరాలను సేకరించి.. వారికి వాహనాలను అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు.
అయితే మహిళకు స్కూటీని అప్పగించిన విషయంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అలివేణి పోగొట్టుకున్న స్కూటీని తిరిగి ఆమెకు అప్పగించడంపై ఏలూరు పోలీసులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సంఘటనను వివరిస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ ఘటనపై నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శభాష్ పోలీస్ అంటూ ఏలూరు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Borugadda Anil: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్
CID: ఫైళ్ల దహనం కేసులో సీఐడీ దూకుడు
Read Latest AP News And Telangana News
Updated Date - Nov 09 , 2024 | 11:26 AM