CM Chandrababu: టీచర్లకు ఆ భారం తప్పించిన ఏపీ ప్రభుత్వం..
ABN, Publish Date - Aug 06 , 2024 | 12:21 PM
అమరావతి: గత ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ప్రవేశపెట్టిన బాత్‌రూమ్‌ల ఫొటోల యాప్‌కు చంద్రబాబు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. బాత్‌రూమ్ ఫొటోలు తీసి అప్‌లోడ్ చేసే యాప్‌ను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం పాఠశాలల్లో అనేక రకాల యాప్‌లు తీసుకొచ్చింది.
అమరావతి: గత ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ప్రవేశపెట్టిన బాత్‌రూమ్‌ల ఫొటోల యాప్‌కు (Bathroom photos app) చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Govt.,) ఫుల్‌స్టాప్ (Full stop) పెట్టింది. బాత్‌రూమ్ ఫొటోలు తీసి అప్‌లోడ్ చేసే యాప్‌ను పాఠశాల విద్యాశాఖ (School Education Department) తొలగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు (Education Department Director Vijayaramaraju) ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం పాఠశాలల్లో అనేక రకాల యాప్‌లు తీసుకొచ్చింది. ప్రతిరోజూ టీచర్లు (Teachers) ఆ యాప్‌లు వినియోగించి సమాచారం అప్‌లోడ్ (upload) చేసే విధానాన్ని ప్రారంభించింది. అందులో ఒకటి బాత్‌రూమ్ ఫొటోల క్యాప్చరింగ్ యాప్ (Capturing App). ప్రతిరోజూ ఉదయం పాఠశాలకు రాగానే టీచర్లు బాత్‌రూమ్‌ల పరిశుభ్రతను తెలిపేలా వాటి ఫొటోలను తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇలా తమతో బాత్‌రూమ్‌ల ఫొటోలు తీయించడం అవమానకరంగా ఉందని, ఈ ఒక్క యాప్‌ను వెంటనే తొలగించాలని అప్పట్లో టీచర్లు గగ్గోలు పెట్టారు. కానీ ప్రభుత్వం వినిపించుకోలేదు. అయితే, ఇది టీచర్లను అవమానించినట్లుగా ఉందని భావించిన టీడీపీ ప్రభుత్వం (TDP Govt.,) ఆ యాప్‌ను పూర్తిగా తొలగించింది. యాప్‌ను తొలగించినందుకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి, నోబుల్ టీచర్స్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకట్రావు, బి.హైమారావు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా..
సుదీర్ఘమైన ప్రసంగాలు లేవు! పేజీలకొద్దీ ప్రజెంటేషన్లు లేవు! అంతా... క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా, సుత్తిలేకుండా! కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిన తీరిది! ముఖ్యమంత్రి చంద్రబాబు గతంతో పోలిస్తే ఈసారి వినూత్నంగా దీనిని నిర్వహించారు. సంబంధిత అంశాలపై తమ ప్రాధాన్యాలు ఏమిటో... తమకేం కావాలో ఆయన స్పష్టంగా చెప్పారు. సీనియర్ అధికారులు కూడా సుదీర్ఘ వివరణలతో సమయం తినేయకుండా విషయం సూటిగా చెప్పేలా సీఎం జాగ్రత్త తీసుకొన్నారు. వారి ప్రజెంటేషన్లలో ఎక్కడైనా ఏదైనా లోపం కనిపిస్తే అక్కడికక్కడే ఆ విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పారు. దీంతో ఆయన అన్నీ సునిశితంగా గమనిస్తున్నారనే సంకేతాలు వెళ్లాయి. గతంలో చంద్రబాబు హయాంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండు రోజులు జరిగేది. చిన్న చిన్న విషయాలపైనా కొందరు అధికారులు సుదీర్ఘ చర్చలు పెట్టేవారు. ఈసారి దానికి అవకాశం లేకుండా సమావేశాన్ని ఒక రోజుకు పరిమితం చేశారు.
సంక్షిప్తంగా వెళ్దాం.. సీఎం చంద్రబాబు
మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తదుపరి అజెండాకు సమయం సరిపోదేమో అన్న అనుమానాన్ని కొందరు అధికారులు వ్యక్తం చేశారు. ‘‘సమయం ఎలా వాడుకోవాలో మన చేతిలో ఉంటుంది. మొత్తం అజెండాను తాను పూర్తి చేస్తాను. కొంత సంక్షిప్తంగా వెళ్దాం’’ అని చంద్రబాబు అన్నారు. ఆ మాట ప్రకారమే తర్వాత సమీక్షలు వేగంగా నడిపించారు. అధికారుల ప్రజెంటేషన్లు అసమగ్రంగా ఉంటే అప్పటికప్పుడే చంద్రబాబు తప్పుపట్టారు. రోడ్లు భవనాలు, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ప్రజెంటేషన్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గతంలో ఏం తప్పులు జరిగాయో... మీ శాఖల్లో నెలకొన్న పరిస్ధితి ఏమిటో చెప్పకుండా అందంగా ప్రజెంటేషన్ ఇస్తే ఏం ఉపయోగం? సమస్య ఏమిటో... ఎలా మొదలైందో కూడా చెప్పాలి కదా’ అని ఆయన వ్యాఖ్యానించారు. వైద్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు తన ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకొన్నారు. అంబులెన్సులు సకాలంలో వెళ్తున్నాయో లేదో చూడటానికి ఏం వ్యవస్ధ ఉందని ఆయన ప్రశ్నించారు. అటువంటిది ఏమీ లేదని కృష్ణబాబు చెప్పారు. అటువంటి వ్యవస్ధ పెట్టుకోకుండా... వాటిని సక్రమంగా పర్యవేక్షించకుండా ఇక్కడ మనం ఎన్ని మాట్లాడుకొన్నా ఏం ఉపయోగం లేదని... అటువంటి వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రికి అన్ని అంశాలపై పట్టు ఉందని... అన్నీ గమనిస్తున్నారని అర్థం కావడంతో అధికారులు కూడా తమ ప్రజెంటేషన్లలో అవసరమైన మేరకే వివరించి, మిగిలిన వాటిని తగ్గించేయడం కనిపించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టిన చింతా మోహన్
కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ.. (ఫోటో గ్యాలరీ)
తెలంగాణ ప్రభుత్వంతో కాగ్నిజెంట్ ఎంవోయు..
జీహెచ్ఎంసీలో మరో అవినీతి తిమింగలం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 06 , 2024 | 12:21 PM