ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YSRCP: బైరెడ్డి సిద్ధార్థ్‌కు కీలక బాధ్యతలు కట్టబెడుతున్న సీఎం జగన్ !!

ABN, Publish Date - Jan 08 , 2024 | 04:47 PM

Andhrapradesh: వైసీపీలో నియోజకవర్గాల ఇంచార్జీల మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు జాబితాలను రిలీజ్ చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. మూడో జాబితా కోసం సన్నాహాలు జరిగింది. ఇందులో భాగంగా.. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పార్టీ పెద్దల నుంచి పిలుపు వెళ్లింది.

అమరావతి: వైసీపీ అధిష్ఠానం పలు నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి మూడో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పార్టీ పెద్దల నుంచి పిలుపు వెళ్లింది. ఈ జాబితాలో నందికొట్కూరు, మార్కాపురం, విజయనగరం, కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జుల నియామకానికి సంబంధించి ఆయా నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) సోమవారం చర్చిస్తున్నారు.

నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి మార్పు కసరత్తులో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇంచార్జి బైరెడ్డి సిద్దార్థరెడ్డికి (Byreddy Siddarth Reddy) సీఎంవో నుంచి పిలుపు వెళ్లింది. దీంతో సోమవారం సీఎంవోకు చేరుకుని ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. నందికొట్కూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ (MLA Arthur) అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన ఇక్కడి నుంచి కొత్త అభ్యర్థి ఎంపికపై చర్చించినట్టు సమాచారం. కాగా బైరెడ్డి ఎవర్ని నిలబెట్టినా జగన్ ఓకే అనే పరిస్థితి ఉందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి చూస్తే బైరెడ్డికి జగన్ రెడ్డి కీలక బాధ్యతలే కట్టబెట్టబోతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.


వరుస సమావేశాలు..!

అటు మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి నియామకంపై సీఎం కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి (MLA Nagarjuna Reddy), జల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డిలకు (Jamke Venkatreddy) పిలుపు వెళ్లడంతో ఇరువురు నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఇరువురు నేతలో సీఎం చర్చలు చేపట్టారు.

అలాగే విజయనగరం పార్లమెంట్ ఇంచార్జి నియామకంపై ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో (MP Bellana Chandrashekar) సీఎం జగన్ సమావేశమయ్యారు. సమావేశంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy) పాల్గొన్నారు. మరోవైపు కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి నియామకానికి సంబంధించి డోన్ ఎమ్మెల్యే, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని (Minister Buggana Rajendranath reddy) సీఎం జగన్ సీఎంవోకి పిలిపించినట్లు తెలుస్తోంది.

అసంతృప్తులు అందరూ రండి..!

అంతకుముందు.. వైసీపీ పెద్దల పిలుపుమేరకు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మరోసారి తాడేపల్లి సీఎం కార్యాలయానికి వచ్చారు. అలాగే చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు కూడా సీఎంవోకు చేరుకున్నారు. వీరితో పాటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడేపల్లికి వచ్చారు. పార్టీలో జరిగే పరిణామాలపై ఇటీవలే బహిరంగంగానే డొక్కా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తనకు సీఎం ను కలిసేందుకు అవకాశం కల్పించడం లేదనే అసంతృప్తితో డొక్కా ఉన్నారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పించాలని బహిరంగ సభలో నేతలను డొక్కా కోరారు. ఈ క్రమంలో అధిష్టానం పిలుపు మేరకు డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

ముందుగా నేతలతో సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల సమావేశమవుతున్నారు. సర్వే నివేదికలు, మార్పుల విషయాన్ని నేతలతో సజ్జల, ధనుంజయ్ రెడ్డి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి, అవసరాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేలు, నేతలతోనే కలిసేందుకు సీఎం వైఎస్ జగన్ అనుమతిస్తోన్నట్లు సమాచారం.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 08 , 2024 | 05:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising