ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CPI: ఏపీలో అల్లర్లకు వైసీపీనే కారణం: నారాయణ

ABN, Publish Date - May 21 , 2024 | 01:55 PM

హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. అల్లర్లపై దర్యాప్తు కోసం వేసిన సిట్ వెస్ట్ అని, దానివల్ల ఉపయోగం లేదని అన్నారు.

హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI National Secretary Narayana) సంచలన వ్యాఖ్యలు (Sensational comments) చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అల్లర్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే (YCP) కారణమని ఆరోపించారు. అల్లర్లపై దర్యాప్తు కోసం వేసిన సిట్ (SIT) వెస్ట్ అని, దానివల్ల ఉపయోగం లేదని అన్నారు. ఏపీలో స్ట్రాంగ్ రూంలో ఉన్న ఈవీఎం (EVM)లకు భద్రత లేదని, ఎక్కడా సీసీ కెమెరాలు (CC Cameras) లేవని విమర్శించారు. కిందిస్థాయిలో పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, దాడులపై విచారణకు వేసిన సిట్ ఒక బోగస్ అని నారాయణ వ్యాఖ్యానించారు.


అధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) లండన్ (London) పర్యటనకు వెళ్ళారని.. తెలుగుదేశం అధ్యక్షుడు (TDP Chief), ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అమెరికా (America)కు పోయారని నారాయణ అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే ఇద్దరూ విదేశాలకు వెళ్ళడం బాధ్యతా రాహిత్యమన్నారు. రాష్ట్రంలో అల్లర్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో అల్లర్లపై సిట్ కాదని.. జ్యూడిషియల్ విచారణ జరగాలన్నారు. బెంగళూరులో రేవ్ పార్టీపై రకరకాల కధనాలు వస్తున్నాయని, అసలు ఆ రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎలా వచ్చాయో కొనుక్కోవాలన్నారు. రేవ్ పార్టీకి సంబంధం లేని వాళ్ళను బజారుకీడ్చటం సరైంది కాదని నారాయణ అన్నారు.


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాల్సింది బీఆర్ఎస్‌పై కాదని, బీజేపీపై చేయాలని నారాయణ సూచించారు. లేకుంటే బీజేపీ కాంగ్రెస్‌ను మింగేసే ప్రమాదముందన్నారు. బీజేపీపై పోరాటం విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్సీ బై ఎలక్షన్‌లో సీపీఐ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే ఉంటుందని నారాయణ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎఫ్ఐఆర్‌లో సెలబ్రిటీల పేర్లు..

ఆ గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి: సోమిరెడ్డి

వైభవంగా ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు..

. సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 01:58 PM

Advertising
Advertising