Donations: మేము సైతం అంటున్న ప్రముఖులు.. వరద బాధితులకు విరాళాల వెల్లువ
ABN, Publish Date - Sep 30 , 2024 | 02:23 PM
Andhrapradesh: విజయవాడకు చెందిన ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ (ఐసీఎమ్‌ఏ) ప్రతినిధులు రూ.50 లక్షల విరాళం అందజేశారు. అనంతపురానికి చెందిన కేఎమ్ షకీల్ సఫీ నేతృత్వంలో ఏపీ వక్ఫ్ ఇన్ స్టిట్యూషన్స్, ముతవల్లీస్ అండ్ మేనేజింగ్ కమిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.7,86,000 విరాళంగా అందజేశారు.
అమరావతి, సెప్టెంబర్ 30: వరద బాధితుల (Flood Victims) కోసం విరాళాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాధితులను ఆదుకునేందుకు మరికొంతమంది ప్రముఖులు ముందుకొచ్చారు. సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను (Minister Nara Lokesh) కలిసి ప్రముఖులు విరాళాలు అందజేశారు. విజయవాడకు చెందిన ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ (ఐసీఎమ్‌ఏ) ప్రతినిధులు రూ.50 లక్షల విరాళం అందజేశారు.
Tourism: బీచ్‌పై మనసు పారేసుకున్నారా.. హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్నవివే..
అనంతపురానికి చెందిన కేఎమ్ షకీల్ సఫీ నేతృత్వంలో ఏపీ వక్ఫ్ ఇన్ స్టిట్యూషన్స్, ముతవల్లీస్ అండ్ మేనేజింగ్ కమిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.7,86,000 విరాళంగా అందజేశారు. తెనాలి పిడపర్తిపాలెంకు చెందిన అరుణోదయ మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో రూ.1,21,000 విరాళం అందించారు. అలాగే మచిలీపట్నంకు చెందిన ఎమ్.ధనలక్ష్మి రూ.లక్ష విరాళం, అనంతపురానికి చెందిన గుండిగ నాగరాజు రూ.10వేలు విరాళం ఇచ్చారు. కష్టాల్లో ఉన్న వారికి తమవంతు సాయం అందించిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
కొద్దిరోజుల క్రితం గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.6,01,116 , అమలాపురానికి చెందిన బోనం వెంకట చలమయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ బోనం కనకయ్య రూ.5 లక్షలు, నంద్యాలకు చెందిన ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఎండీ ఎస్.దినేష్ రెడ్డి, కాలేజీ డీన్ బి.సూర్యప్రకాశ్ రెడ్డి రూ.4 లక్షలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో ప్రజలు, వివిధ సంస్థల నుంచి సేకరించిన విరాళం రూ.2,95,000, నవ్యాంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రతినిధి జయకుమార్ రూ.2,50,000, మదనపల్లెకు చెందిన గోల్డెన్ వాలీ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ ఎన్.వి రమణారెడ్డి, కట్టా దొరస్వామి నాయుడు రూ.2 లక్షలు, అనంతపురానికి చెందిన వి.సురేష్ నాయుడు లక్ష రూపాయలు, బీజేపీ మజ్దూర్ విభాగం నాయకుడు నాగేశ్వరరావు రూ.10వేలు అందజేశారు. కాగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమవంతు సాయం అందించిన వారికి మంత్రి నారా లోకేష్ కృతిజ్ఞతలు తెలిపారు.
Israel: ఘోరం.. వెయ్యి మంది స్పాట్ డెడ్
కాగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలలో విజయవాడ వాసుల జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. కొద్దిరోజుల పాటు అనేక కాలనీలు జలదిగ్భందంలోనే ఉండిపోయిన పరిస్థితి. వరద బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే విజయవాడ వాసులు కాస్త కోలుకుంటున్నారు. మరోవైపు వరద బాధితులకు సహాయ సహకారాల కోసం సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కదలి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు పది రోజులు విజయవాడలోనే ఉంటూ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి వారిక సహాయ సహకారాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మంత్రులు, అధికారులు వరద ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు కూడా. అలాగే ప్రభుత్వ సహాయమే కాకుండా వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించాలంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు అనేక మంది దాతలు ముందుకొచ్చారు. రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇలా అనేక మంది ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఒకరోజు జీతాన్ని విరాళంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. వివిధ జిల్లాల నుంచి సామన్యులు కూడా తమవంతు సాయం అందజేశారు. ఇప్పటికీ విరాళాల వెల్లవ కొనసాగుతూనే ఉంది.
ఇవి కూడా చదవండి...
Pawan Kalyan: ప్రాయశ్చిత దీక్ష విరమణ కోసం తిరుమలకు పవన్
Pawan Kalyan: ‘‘ఓం నమో నారాయణాయ’’... కీరవాణికి ధన్యవాదాలు
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 30 , 2024 | 05:00 PM