ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: మహిషాసురమర్ధినిగా అమ్మవారి దర్శనం..

ABN, Publish Date - Oct 11 , 2024 | 09:02 AM

దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం.

విజయవాడ: ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (Dussehra Sharannavaratri Celebrations) వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు తొమ్మిదవ అలంకారంగా మహిషాసురమర్ధిని (Mahishasuramardhi) అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే తెల్లవారుజామునుంచి పడుతున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దూర బారాల నుండి భవానీలు ఇంద్రకీలాద్రికి కాలినడకన వస్తున్నారు.


దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా ముల్లోకాలను అమ్మవారు కాపాడినట్లే... భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని.. అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞానం మీద విజ్ఞానం, బాధల మీద విజయం పొందే తత్వమే ఈ అమ్మవారు పూజలో పరమలక్ష్యం. ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తోంది. ఈరోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం పాయసాన్నం, రవ్వతో చేసి చక్కెర పొంగలి సమర్పిస్తారు.


కాగా ఇంద్రకీలాద్రికి భక్తుల రాక పెరుగుతోంది. సాధారణ భక్తులతో పాటు భవానీ మాలధారులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. గురువారం దుర్గాదేవి అలంకారంలో కొలువైన అమ్మవారిని దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. ఉచిత దర్శనం క్యూలో ఉన్న భక్తులకు దర్శనం పూర్తి కావడానికి 5 గంటల సమయం పట్టింది. వినాయకుడి ఆలయం నుంచి ప్రారంభమయ్యే అన్ని క్యూలు భక్తులతో నిండిపోయాయి. భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తులు ముందుకు సాగారు. అమ్మవారిని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కృష్ణతేజ, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తదితరులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పట్టువస్త్రాలు సమర్పించారు. సినీ దర్శకుడు ఏఎం రత్నం కుటుంబంతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి వేదపండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎనిమిదవ రోజుకు చేరుకున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

రతన్ టాటా వారసుడు ‘అతడే’నా?

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 11 , 2024 | 09:02 AM