ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు... పోటెత్తిన భక్త జనం

ABN, Publish Date - Oct 12 , 2024 | 12:59 PM

దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ఉదయం ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.

విజయవాడ, అక్టోబర్ 12: దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ఉదయం ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామారావు, దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా ఈ పూర్ణాహుతి కార్యక్రమం ముగిసింది.

Also Read: రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదులు.. వారి లక్ష్యం అదే..!


మరోవైపు దసరా నవరాత్రుల్లో భాగంగా నేడు చివరి రోజు. ఈ నేపథ్యంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో.. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. దీంతో దేవాలయంలోకి వెళ్లే అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఇంకోవైపు దుర్గమ్మ మాల ధారణతో వచ్చిన భవానీలు సైతం భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.

Also Read: మౌనం వీడండి.. హిందువులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు


ఎందుకంటే..

మరోవైపు ఈ రోజు దుర్గమ్మ వారికి నిర్వహించాల్సిన హంస వాహనంపై ఊరేగింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందులోభాగంగా దుర్గా ఘాటులోని కృష్ణా నది ఒడ్డున హంస వాహనంపై గంగా సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ఆలయ పురోహితులు కైంకర్యాలు నిర్వహించనున్నారు. కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహ గరిష్ట స్థాయిలో ఉంది. ఎగువ నుంచి దాదాపు 40 క్యూసెకుల వరద నీరు కృష్ణానదిలో ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మ వారి జల విహారాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also Read: పెద్దమ్మ తల్లి దేవాలయానికి పోటెత్తిన భక్తులు: నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు


ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానేనా..?

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వెంటేనే అప్రమత్తమై.. సహాయక చర్యలు చేపట్టింది. దాంతో కొద్ది రోజుల్లోనే విజయవాడ నగరం వరద ముంపు నుంచి బయట పడింది. ఇక వరద సమయంలో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Also Read: సొంతిల్లు కావాలంటే.. ఇలా చేయండి చాలు..

Also Read: మీరే నాకు ఆదర్శం..భువనేశ్వరి భావోద్వేగం


అలాగే వరద బాధితులను ఆదుకోవాలంటూ చంద్రబాబు ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతో లక్షలాది మంది మేము సైతం అంటూ ముందుకొచ్చి.. ప్రభుత్వానికి వరద సాయం అందించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సైతం వెంటనే స్పందించి తక్షణ సాయం ప్రకటించింది. మరోవైపు విజయవాడలో కృష్ణా నదిలో వరద ఉదృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో అమ్మవారికి హంస వాహన సేవను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Also Read: గాల్లోకి ఎగిరిన బోగీలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Oct 12 , 2024 | 01:54 PM