ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించండి

ABN, Publish Date - Dec 21 , 2024 | 01:03 AM

1983లో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించాలంటూ ఈడుపుగల్లు మాజీ సర్పంచ్‌ షేక్‌ మాబు సుబాని సీఎం చంద్రబాబు నాయుడును కోరా రు. మండలంలోని ఈడుపుగల్లు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

కంకిపాడు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : 1983లో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించాలంటూ ఈడుపుగల్లు మాజీ సర్పంచ్‌ షేక్‌ మాబు సుబాని సీఎం చంద్రబాబు నాయుడును కోరా రు. మండలంలోని ఈడుపుగల్లు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాబు సుబాని మాట్లాడుతూ 1983లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈడుపుగల్లు గ్రామంలో 176 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిందన్నారు. అయితే అప్పటి నుంచి సంబంధిత స్థలాలకు పట్టాలు ఇప్పించాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు తక్షణం ఆ 176 మందికి పట్టాలు ఇప్పించే విధంగా చర్యలు తీసు కోవాలని జిల్లా కలెక్టర్‌ డి.కె. బాలాజీని ఆదేశించారు. దీంతో ఈడుపుగల్లు గ్రామస్థులు సీఎం చంద్రబాబుకు జై జైలు కొట్టారు.

ఈడుపుగల్లుకు సీఎం వరాలజల్లు

ఈడుపుగల్లులో 1983 - 87 మధ్యలో 176 మం దికి ఇంటిస్థలాలు ఇచ్చారనీ, ఈ స్థలాలు 22ఏలో ఉన్నాయనీ, వీటన్నింటినీ 22ఏ లోనుంచి తొలగించి పట్టాలు ఇస్తామన్నారు. కొంతమంది జనచైతన్య హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు తమ భూమిని సెంటులో 0.1శాతం, 0.4 శాతం గజాలు ఆక్రమిం చుకున్నారని ఫిర్యాదులు వచ్చాయనీ, వీటిని కూడా పరిష్కరిస్తామన్నారు. కొన్ని కుటుంబాలు అన్నద మ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉండి వాటిని పరిష్క రించాలని అర్జీలు అందచేశారనీ, పెద్దల మాటవిని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

సీఎం సమక్షంలో టీడీపీలో చేరికలు

పెనమలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు పెనమలూరు మండలం గంగూరు, కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామాల్లో జరిగిన పర్యటన సందర్భంగా టీడీపీలోకి పలువురు వైసీపీ నాయకులు వచ్చి చేరారు. గంగూరు సర్పంచి భర్త అక్బర్‌ బాషా, ఎనిమిది మం ది గ్రామ వార్డు సభ్యులు.. చోడవరం సర్పంచి కాకర్ల వెంకటరత్నంలు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్య క్షుడు కోయ ఆనంద్‌ ప్రసాద్‌, అనుమోలు ప్రభాకరరావు, మారుపూడి ధనకోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 01:03 AM