ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టండి

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:11 AM

సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ‘మీకోసం’ ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంపై నోడల్‌ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశించారు.

‘మీకోసం’లో సమస్యలు వింటున్న కలెక్టర్‌ లక్ష్మీశ

కృష్ణలంక, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ‘మీకోసం’ ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంపై నోడల్‌ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులతో కలిసి పాల్గొన్నారు. తొలుత పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి సంబంధించి రిసెప్షన్‌, సమాచారకౌంటర్‌తో పాటు రిజిస్ర్టేషన్‌, హెల్ప్‌డెస్క్‌, ఆధార్‌ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి.జ్యోతి తదితరులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

విజయవంతంగా చెత్త నుంచి

సంపద సృష్టి కేంద్రాలు

జిల్లా పంచాయతీ కార్యాలయం అధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ సందర్భంగా ఏర్పాటుచేసిన వర్మీ కంపోస్ట్‌ విక్రయ కేంద్రాన్ని కలెక్టర్‌ లక్ష్మీశ పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి గ్రామపంచాయతీ ‘చెత్త సంపద సృష్టి కేంద్రం’ ద్వారా తయారుచేసిన వర్మీ కంపోస్టు విక్రయాలను పరిశీలించారు. ఈ కేంద్రం ద్వారా కిలో వర్మి కంపోస్ట్‌ ప్యాకెట్‌ రూ.20కు అందుబాటులో వున్నట్టు అధికారులు వివరించారు. అరకిలో, కిలో, రెండు కిలోల ప్యాకెట్లను అందుబాటులో వుంచినట్టు వివరించారు. మొక్క వేగంగా, ఆరోగ్యవంతంగా పెరిగేందుకు వర్మీ కంపోస్టు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లాలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించడం జరుగుతోందని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 01:11 AM