Vijayawada: మార్కెట్లో గోల్డ్ మాఫియా డాన్!
ABN, Publish Date - Dec 10 , 2024 | 08:10 AM
బంగారం వర్క్‌షాపు నిర్వహిస్తున్న ఓ వ్యాపారి. గోల్డ్ మాఫియా డాన్ అవతారం ఎ త్తాడు. బంగారం వ్యాపారులకు తక్కు వ ధరకు బంగారం బిస్కెట్లు అమ్ము తానని మాయమాటలు చెప్పి మోసగించటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులకు డబ్బులిస్తామ ని కాలయాపన చేస్తూ..
వన్టన్, డిసెంబరు 9 (ఆంధ్ర జ్యోతి): వాణిజ్య వ్యాపార కేంద్రమైన విజయవాడ వన్ టౌన్ లో బంగారం వర్క్‌షాపు నిర్వహిస్తున్న ఓ వ్యాపారి. గోల్డ్ మాఫియా డాన్ అవతారం ఎ త్తాడు. బంగారం వ్యాపారులకు తక్కు వ ధరకు బంగారం బిస్కెట్లు అమ్ము తానని మాయమాటలు చెప్పి మోసగించటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులకు డబ్బులిస్తామ ని కాలయాపన చేస్తూ కనిపించకుం డా తిరగటంతో పలువురు రహస్యంగా డా క్రైం పోలీసులను ఆశ్రయించినట్లు తె లుస్తుంది. అక్కడి అధికారుల్లో కొంద రు పరిచయం ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా సెటిల్ చేసుకో మంటూ సూచనలిస్తున్నట్టు తెలుస్తోంది .
కండ్రిక ప్రాంతానికి చెందిన 'ఆర్కే' అనే వ్యక్తి సుమారు 15ఏళ్ల క్రితం వన్ టౌన్ మార్వాడీ వీధిలో బంగారం వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేశాడు. అనంతర కాలంలో ఆ వ్యాపారి వ్యాపా రాన్ని ఆపేయడంతో అక్కడ పనిచేసిన రాన్ని ఆపేయడంతో అక్కడ పనిచేసిన అరికే మాత్రం వన్లైన్లో బంగారు ఆభరణాల వర్క్షాపును ప్రారంభిం చాడు. బంగారం బిస్కెట్లను ఇతర ప్రాంతాల నుంచి రహస్యంగా తెచ్చి పలువురు వ్యాపారులకు అమ్మటం ప్రారంభించాడు. ప్రభుత్వానికి చెల్లిం ప్రారంభించాడు. ప్రభుత్వానికి చెల్లిం చాల్సిన ట్యాక్స్ల ను ఎగ్గొట్టి రోజుకు నాలుగైదు బిస్కెట్లు అమ్ముతూ బిస్కె ట్పై రూ.60 నుంచి రూ.70వేల వరకు సంపాదిస్తున్నాడని బాధితులు ఆరోపి స్తున్నారు.
వన్ టౌన్ లో మరో మూడు వర్క్ షాపులు, రాధానగర్లో రూ.కోట్ల విలువైన రెండు బిల్డింగ్లను కొను గోలు చేశాడు. ఈ ఏడాదిలో ఓ నేరస్థు డిని క్రైం పోలీసులు పట్టుకోగా, దొంగిలించిన బంగారాన్ని ఆర్కి అనే వ్యాపా రికి అమ్మినట్టు విచారణలో బయటప డినట్లు సమాచారం. వైసీపీ ప్రభు త్వంలో ఓ మాజీ మంత్రికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ అడ్డగోలుగా వ్యాపారం చేసిన ఈ డాన్ తనపై ఈ పోలీసు నిఘా ఉంటుందనే జాగ్రత్తతో ఓ అధికార పార్టీలోకి జంప్ అవ్వాలని ప్రయత్నించగా ఇతడి గురించి తెలు. సుకున్న పార్టీ నేతలు చివాట్లు పెట్టి. మళ్లీ కనిపించొద్దంటూ హెచ్చరించ టంతో ఉత్తరాంధ్రలోని ఓ ఎంపీని, ఎమ్మెల్యేను కలిసి అధికార పార్టీలోకి రావటానికి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ డాన్ ఆగడాలతో తమ వ్యాపారం తగ్గిపోతోందని. వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
Read Also: Manchu Manoj: మోహన్‌బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ ఏమన్నారంటే..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Dec 10 , 2024 | 08:10 AM