Deputy CM: ఆయన ఒక కులానికి కాదు... దేశం మొత్తం గర్వించే నాయకుడు..
ABN, Publish Date - Dec 15 , 2024 | 12:57 PM
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కల్యాణ్ కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత పొట్టి శ్రీరాములు గొప్ప తనం అర్థమైందన్నారు. ఆయన విగ్రహం వెతకాలంటే..
విజయవాడ: పొట్టి శ్రీరాములు (Potti Sriramulu ) వర్ధంతి (Death Anniversary) సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదివారం విజయవాడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతుండగా గట్టిగా మాట్లాడాలని అభిమానులు కోరారు. వర్ధంతి కదా.. అరిస్తే బాగోదు అంటూ పవన్ ఛలోక్తి విసిరారు. మహనీయుల వర్దంతి, జయంతిలు చేయాలని, భవిష్యత్తు తరాలకు వారి సేవలను తెలిసేలా చేయాలని అన్నారు. మనుషులకు మరుపు చాలా సహజమని, ఇటువంటి కార్యక్రమాలు ద్వారా మనం గుర్తు చేసుకుంటామని పవన్ అన్నారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కల్యాణ్ కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత పొట్టి శ్రీరాములు గొప్ప తనం అర్థమైందన్నారు. ఆయన విగ్రహం వెతకాలంటే ఆర్య వైశ్య సమాజంలోనే దొరికేదని.. ఆయన ఒక కులానికి కాదు... దేశం మొత్తం గర్వించే నాయకుడని వ్యాఖ్యానించారు. ఆయన జివిత గాథతో ప్రదర్శించిన డాక్యుమెంటరీ బాగుందని, హిస్టరీ బుక్‌లు చదవడం ద్వారా తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, తెలుగు వారి ఉనికి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ఆనాడు జాతీయ నాయకత్వం వ్యతిరేకించిందన్నారు.
పొట్టి శ్రీరాములు మృతదేహాన్ని మోయడానికి నలుగురు రాకపోవడం కలచి వేసిందని, మనం తెలుగు వాళ్లం అని ఈరోజు గర్వంగా చెబుతున్నామంటే అది పొట్టి శ్రీరాములు త్యాగమే కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు ఆత్మార్పణ దినం చాలా గొప్పగా చేయాలని సిఎం చంద్రబాబు సంకల్పించారని, సమయం తక్కువుగా ఉన్నందువల్ల ఇలా చేయాల్సి వచ్చిందని పవన్ అన్నారు. వచ్చే ఏడాది నుంచి తెలుగు వాళ్లంతా ఆత్మార్పణ దినం గొప్పగా చేయాలని పిలుపిచ్చారు. కుటుంబం కన్నా సమాజం ముఖ్యం అనుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, ఆయన గొప్పతనం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ సహచరులకు చెప్పార్నారు. ఇంత గొప్ప గా చెప్పి, స్పూర్తి నింపిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
తనకు ఈ పదవి వచ్చిందన్నా, తెలుగు వాళ్లు అన్నా.. పొట్టి శ్రీరాములు త్యాగమే కారణమని పవన్ కల్యాణ్ అన్నారు. మదరాసీలు కాదు... నేను తెలుగు వాడిని అని చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఒక పార్టీ ని నడపటం చాలా కష్టం, పాలసీలు అమలు చేయడం కష్టమని.. చంద్రబాబు ఇలా పార్టీని నడిపి, ప్రజలకు చేరువ చేయడం గొప్ప విషయమని అన్నారు. 2047 విజన్ ద్వారా కుల మాతాలకు అతీతంగా అభివృద్ధి చెందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. విజన్2047 ను విమర్శించే వాళ్లు..2020 విజన్ ను గుర్తు తెచ్చుకోండన్నారు. హైదరాబాదులో రాళ్లు, రప్పలు ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. తప్పకుండా ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని. విజన్ 2047 ను ముందుకు తీసుకు వెళ్లేందుకు కంకణ బద్దులై ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం పర్యటన
బాలకృష్ణ, జానారెడ్డిలకు బిగ్ షాక్..
తల్లికి సాయం, తండ్రికి స్నేహం. అన్నదమ్ములకు ఆసరా
మహానందిలో చిరుతపులి సంచారం కలకలం..
అల్లు అర్జున్ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్ఢ్ కార్యక్రమం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 15 , 2024 | 12:57 PM