Nagababu: పవన్ మనసులో నుంచి పుట్టిన గొప్ప ఆలోచనే కార్యకర్తలకు బీమా
ABN, Publish Date - Jul 22 , 2024 | 12:46 PM
Andhrapradesh: కార్యకర్తలకు భద్రత, భరోసా కల్పించే క్రియాశీలక సభ్యత్వంలో అందరూ భాగస్వామ్యం కావాలని జనసేన నేత నాగబాబు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసులో నుంచి పుట్టిన గొప్ప ఆలోచన ‘‘కార్యకర్తలకు బీమా’’ అని చెప్పుకొచ్చారు. ఇటీవల వేరు వేరు ప్రమాదాల్లో మృతి....
అమరావతి, జూలై 22: కార్యకర్తలకు భద్రత, భరోసా కల్పించే క్రియాశీలక సభ్యత్వంలో అందరూ భాగస్వామ్యం కావాలని జనసేన నేత నాగబాబు (Janasena Leader Nagababu) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawankalyan) మనసులో నుంచి పుట్టిన గొప్ప ఆలోచన ‘‘కార్యకర్తలకు బీమా’’ అని చెప్పుకొచ్చారు. ఇటీవల వేరు వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 81 మంది క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.4.05 కోట్ల బీమా చెక్కులను మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
Raghurama Krishnaraju: హాయ్ జగన్ అంటూ దగ్గరకు వెళ్లి...
‘‘ఎందరో కొడుకులని కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తను కోల్పోయిన భార్యలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు నా చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తూ వారిని ఓదార్చినప్పుడు నా కళ్ళు చమర్చాయి’’ అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యారు. బాధిత కుటుంబాలకు వారు కోల్పోయిన మనిషిని వెనక్కి తీసుకురాలేము కానీ, వారి బాధలను ఒక కుటుంబ సభ్యునిగా నేను ఉన్నాను అని ధైర్యాన్ని ఇచ్చేది ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వమని చెప్పుకొచ్చారు. ఒక కుటుంబాన్ని జనసేన పార్టీతో మమేకం చేసే ఈ కార్యక్రమాన్ని అందరూ పవిత్ర కార్యక్రమంగా భావించాలన్నారు. నిర్ణయించిన గడువు వరకు నిబద్ధతతో సభ్యత్వాలను చేయించాలని కోరారు. బాధల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునే ప్రక్రియలో అందరూ కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో తోడు నడవాలని జనసేన నేత నాగబాబు పిలుపునిచ్చారు.
Fire Accident: మదనపల్లి అగ్ని ప్రమాదం ఆ కుటుంబం పనేనా?
కాగా... ఈనెల 18 నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 18 నుంచి 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల బీమా సభ్యత్వంతో పాటు రూ.50 వేలు ప్రమాద బీమా కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని జనసేన నేతలు, వీర మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పార్టీ అధిష్టానం పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
AP Police: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున అరెస్ట్
CM Chandrababu: మినిట్ టు మినిట్ ఏం జరిగింది?.. మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 22 , 2024 | 12:48 PM