ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: జోగి రమేశ్‌ అనుచరుల బెదిరింపులు!

ABN, Publish Date - Jul 08 , 2024 | 08:53 AM

2 దశాబ్దాల క్రితం ఇళ్ల కోసం కొన్న స్థలాలను కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో..

విజయవాడ/భవానీపురం: 2 దశాబ్దాల క్రితం ఇళ్ల కోసం కొన్న స్థలాలను కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో మాజీమంత్రి జోగి రమేశ్‌ అనుచరుల హస్తం ఉందని నగరంలోని 45వ డివిజన్‌ జోజినగర్‌ కరెంట్‌ ఆఫీసు రోడ్డులోని ఆర్టీసీ సుబ్బారావు ప్లాట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. రూ.లక్షల్లో వ్యయం చేసి ఇళ్ల నిర్మాణాల కోసం 2001లో షేక్‌ మజీద్‌ అనే వ్యక్తి వద్ద 2.17 ఎకరాలను 42 మంది కొన్నామని, ఇందులో 25మంది ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. స్థలాలను కొన్నప్పుడు కనిపించనివారు ఇప్పుడు లక్ష్మీరామ కో–ఆపరేటివ్‌ సొసైటీ పేరుతో వచ్చి అక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. స్థాని క రామరాజ్యనగర్‌ కరెంట్‌ ఆఫీస్‌ రోడ్డులోని స్థలాల వద్ద ఆదివారం విలేకరులతో మాట్లాడారు.


ఆవేదన..

స్థల యజమానులు తంగా రవి, రమణారెడ్డి, కలవకూరి ప్రవీణ్‌ మాట్లాడుతూ.. మాజీమంత్రి జోగి రమేశ్‌, వైసీపీ కార్పొరేటర్‌ మహదేవు అప్పాజీ, మహదేవు హరి పేర్లు చెబుతూ తమను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. భూమిని అమ్మినవారే వీరితో కుమ్మక్కై తమను వీధిని పడేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు నిర్మించుకునేటప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారని, ఇటీవల స్థలాలను వెనక్కి ఇచ్చేయాలని లాయర్‌ ద్వారా 42మందికి నోటీసులిచ్చారని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. రూ.లక్షలు పెట్టి కొన్న స్థలాల పరిరక్షణకు ప్రభుత్వం, కార్పొరేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబా బు సహా కలెక్టర్‌, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్లాట్ల యజమానులు విజయలక్ష్మి, రవళి పాల్గొన్నారు.

ఆగిరిపల్లిలో బ్యానర్ల రగడ

ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ఆదివారం రా త్రి టీడీపీ బ్యానర్లను వైసీపీ నాయకులు చించివేయటం తో గొడవ రాజుకుంది. స్థానిక పొగడచెట్ల మండపం వ ద్ద ఉన్న టీడీపీ బ్యానర్‌ని, వైసీపీ పట్టణ అధ్యక్షుడు చి మట శ్రీను, ఎంపీపీ సాదం గోపి చించివేస్తుండగా అటుగావెళుతున్న టీడీపీ కార్యకర్తలు కాజా కిషోర్‌, రాణిమేకల మల్లేశ్వరరావు ప్రశ్నించటంతో వైసీపీ నాయకులు వీ రిని కొట్టి గాయపర్చారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకోవటంతో వైసీపీ నాయకులు పారిపోయారు. నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి ఉన్న బ్యానర్‌ను చించి ఆయన్ని అవమాన పర్చినవారు బ్యానర్‌ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా టీడీపీ శ్రేణులు భీష్మించుకొని కూర్చున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 08:53 AM

Advertising
Advertising
<