AP Politics: బీజేపీ నేతలను కలిసిన కాపు రామచంద్రారెడ్డి... కారణమిదే..?
ABN, Publish Date - Feb 27 , 2024 | 05:13 PM
బీజేపీ(BJP) అగ్రనేతలను వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి(Kapu Ramachandra Reddy) మంగళవారం నాడు కలిశారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరిలతో రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. అయితే బీజేపీ నిర్దేశించిన ఆహ్వానితుల సమావేశం కావడంతో కాపు వెంటనే బయటకు వచ్చేశారు.
విజయవాడ: బీజేపీ(BJP) అగ్రనేతలను వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి(Kapu Ramachandra Reddy) మంగళవారం నాడు కలిశారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరిలతో రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. అయితే బీజేపీ నిర్దేశించిన ఆహ్వానితుల సమావేశం కావడంతో కాపు వెంటనే బయటకు వచ్చేశారు. కాగా గత కొంత కాలంగా వైసీపీ హై కమాండ్‌పై ఆయన అసంతృప్తితో ఉన్నారు. సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి వైఖరి నచ్చకపోవడంతో ఆ పార్టీకి గత కొన్నిరోజుల క్రితం కాపు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరేది ఆయన సరైన స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈరోజు బీజేపీ నేతలను కలవడం ఆసక్తికరంగా మారింది. బీజేపీలో చేరేందుకు రామచంద్రారెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా..
బీజేపీ నేతలను కలిసిన తర్వాత కాపు రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసేందుకే వచ్చానని చెప్పారు. తమ జిల్లాకు సంబంధం లేని సమావేశం ఇక్కడ జరుగుతుందని.. అందుకే మీటింగ్‌లో నుంచి బయటికి వచ్చేశానని అన్నారు. పార్టీలో ఎప్పుడు చేరేది తర్వాత తెలియజేస్తానని చెప్పారు. ప్రస్తుతానికి పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోలేదని వివరించారు. తాను వైసీపీని పూర్తిగా వదిలేశానని అన్నారు. జగన్ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరుతానో త్వరలో చెబుతానని అన్నారు. వైసీపీ మీటింగ్ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానని తెలిపారు. త్వరలోనే అన్ని విషయాలు వివరిస్తానని అన్నారు. అప్పుడే ఏపీలోని ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడతానని కాపు రామచంద్రారెడ్డి చెప్పారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 27 , 2024 | 05:23 PM