ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kesineni Swetha: రాజీనామా తర్వాత కేశినేని శ్వేత కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jan 08 , 2024 | 12:46 PM

Andhrapradesh: కార్పొరేటర్ పదవికి రాజీనామా అనంతరం కేశినేని శ్వేత మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 11వ డివిజన్ కార్పొరేటర్‌గా రాజీనామా చేశానని.. తన రాజీనామా ఆమోదం పొందాక టీడీపీ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తాము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదన్నారు.

విజయవాడ, జనవరి 8: కార్పొరేటర్ పదవికి రాజీనామా అనంతరం కేశినేని శ్వేత (Kesineni Swetha) మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 11వ డివిజన్ కార్పొరేటర్‌గా రాజీనామా చేశానని.. తన రాజీనామా ఆమోదం పొందాక టీడీపీ (TDP) పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తాము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదన్నారు. టీడీపీ పార్టీ తమను వద్దు అనుకున్నప్పుడు పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదన్నారు. కేశినేని నాని (MP Kesineni Nani) పార్టీకి రాజీనామా చేసాక కార్యకర్తలతో మాట్లాడి భవిషత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.


జగన్ ప్రభుత్వం (Jagan Government) వచ్చాక కార్పొరేటర్‌ల ప్రాణాలకు రిస్క్ అని తెలిసి పోటీ చేశారని.. గౌరవం లేని చోట పని చేయలేమని స్పష్టం చేశారు. గత సంవత్సరం కాలం నుంచి టీడీపీ పార్టీలో కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు. విజయవాడ చుట్టు పక్కన ఉన్న ఒక్క పార్లమెంట్‌లో కూడా అభ్యర్థి లేరన్నారు. కృష్ణా జిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకూ టీడీపీ అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో ఉన్నామన్నారు.

మున్సిపల్ ఎన్నికలప్పుడు విజయవాడలో ముగ్గురు నాయకులు ఇబ్బంది పెట్టారని చెప్పారు. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నామని.. తమతో వచ్చేవాళ్ళకి కచ్చితంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తిరువూరు సభకు కేశినేని నానికి ఏంటి సంబంధం అని లోకేష్ (Nara Lokesh) అడిగారని.. ఆయన పార్లమెంట్ నియోజవర్గంలో ఆయనకు కాక ఇంకెవరికి సంబంధమని ప్రశ్నించారు. కేశినేని నాని మూడవ సారి కూడా విజయవాడ పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారని కేశినేని శ్వేత స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 08 , 2024 | 01:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising