ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఏపీ క్యాబినెట్ ముందుకు కీలక పాలసీలు..

ABN, Publish Date - Oct 16 , 2024 | 12:13 PM

రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో ప్రకటించినట్లు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాథి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వ నూతన విధానాలు రూపొందిస్తోంది. పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ శాఖల్లో నూతన పాలసీలకు శ్రీకారం చుట్టింది. ఆయా శాఖల అధికారులు మూడు నెలల పాటు కొత్త పాలసీలపై విస్తృత కసరత్తు చేసి పాలసీలు సిద్దం చేశారు.

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్ సమావేశం (Cabinet meeting) ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా కీలక నూతన పాలసీలు, రాష్ట్ర కొత్త పారిశ్రామిక విధానంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక విధానం (New Industrial Policy) తీసుకొచ్చే అవకాశముంది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు (20 lakh job opportunities) కల్పించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా నూతన పాలసీ వచ్చే అవకాశముంది. మొత్తం 10 ప్రభుత్వ శాఖల్లో నూతన విధానాలను అధికారులుమ సిద్దం చేశారు.


రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో ప్రకటించినట్లు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాథి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వ నూతన విధానాలు రూపొందిస్తోంది. పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ శాఖల్లో నూతన పాలసీలకు శ్రీకారం చుట్టింది. ఆయా శాఖల అధికారులు మూడు నెలల పాటు కొత్త పాలసీలపై విస్తృత కసరత్తు చేసి పాలసీలు సిద్దం చేశారు. ఇప్పటికే దాదాపు 10 శాఖల్లో నూతన విధానాలను అధికారులు సిద్దం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస సమీక్షలతో పలు శాఖల్లో కొలిక్కి వచ్చిన నూతన విధానాలపై కసరత్తు చేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కొత్త పాలసీల రూపకల్పన చేస్తున్నారు.

జాబ్ ఫస్ట్ (ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యం) అనే ప్రధాన లక్ష్యంతో అధికారులు పాలసీలు సిద్దం చేశారు. సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉత్తమ విధానాల ఆధారంగా అధికారులు కొత్త పాలసీలు రూపొందించారు. ఇండస్ట్రియల్ దెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్స్క్ పాలసీలు క్యాబినెట్ ముందు చర్చకు వచ్చాయి. ముందుగా పెట్టుబడులు పెట్టిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అడిషనల్‌గా 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ కల్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో కసరత్తు చేస్తున్నారు. ఒక కుటుంబం... ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకువస్తోంది. విద్యుత్ రంగంలో దేశంలో అగ్రగామిగా ఉండేలా క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకురానుంది.


అలాగే చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

ఉచిత సిలిండర్ల పథకంపై నేడు నిర్ణయం..

దీపావళి నుంచి ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకంపై ఈరోజు కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఏపీ లో స్వర్ణకార వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్‌లో చర్చించనున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జీవోలు వుంచే goir.ap.gov.in వెబ్‌సైట్‌ను తిరిగి పునరుద్ధరిస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో అప్‌లోడ్ చేయకుండా మాన్యువల్‌గా జారీ చేసిన జీవోలను జీ వో ఐ ఆర్ సైట్లో అప్లోడ్ చేయాలనే దానిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్కిల్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్

భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

జాయ్ జమీమా దారుణాలపై నోరు విప్పిన బాధితులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం నేడు..

వాయుగుండంగా బలపడిన అల్పపీడనం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 16 , 2024 | 12:28 PM