ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sagara Harati: సాగర హారతితో సముద్ర స్నానాలు ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర..

ABN, Publish Date - Nov 15 , 2024 | 10:37 AM

కృష్ణాజిల్లా, మచిలీపట్నం: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సాగర హారతితో సముద్ర స్నానాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 5 గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి హారతులు ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభించారు.

కృష్ణాజిల్లా, మచిలీపట్నం: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ (Manginapudi Beach) వద్ద సాగర హారతి (Sagara Harati)తో సముద్ర స్నానాలు (SeaBathing) శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 5 గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) సముద్రుడికి హారతులు ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభించారు. సముద్ర స్నానాలకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు.

సముద్ర స్నానాల సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. లక్ష నుండి రెండు లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. భక్తులు సముద్రం ఒడ్డున కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక దీపాలతో సముద్ర తీరం వెలుగొందింది. సముద్ర స్నానాల అనంతరం బీచ్ సమీపంలో ఉన్న దత్తరామేశ్వర క్షేత్రం (12 బావుల్లో)లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు బారికేడింగ్ ఏర్పాటు చేశారు. ప్రమాదాలకు తావు లేకుండా గజ ఈతగాళ్లను నియమించారు. మంత్రి కొల్లు రవీంద్ర చిన్న పిల్లలకు ICDS ఆధ్వర్యంలో ఉచిత పాల పంపిణీని ప్రారంభించారు. చిన్న పిల్లల చేతులకు ట్యాగ్‌లు వేశారు. బీచ్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పోలీసు భద్రతా చర్యలను మంత్రి రవీంద్ర పరిశీలించారు.


కాగా శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంభ దేవీకి భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, కుంకుమార్చన పూజలు జరిపి, ఉసిరి చెట్టుకు మహిళలు పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. శివాలయంలో పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు అమ్మవారికి అభిషేకం, విశేష పూజలు చేశారు. భక్తులకు వేదపండితులు తీర్థప్రసాదాలు అందించారు. శివనామస్మరణ చేస్తూ 365 ఒత్తులను భక్తులు వెలిగించారు. శివునికి దీపారాధన జరిపితే పుణ్యం లభిస్తుందని భక్తులు చెబుతున్నారు.

విశాఖలో కార్తీక పౌర్ణమి సందడి..

ఉమ్మడి విశాఖపట్నంలోని పలు ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో భక్తుల ప్రత్యేక పూజలు

పశ్చిమ గోదావరి: జిల్లాలోని పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పంచారామ క్షేత్రానికి వేకువజాము నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేస్తున్నారు. దీపోత్సవంతో దేవాలయ ప్రాంగణం కళకళలాడుతోంది.

నరసాపురం వశిష్ట గోదావరిలో పుణ్య స్థానాలు

పశ్చిమ గోదావరి: నరసాపురం వశిష్ట గోదావరిలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్థానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి వలందర్ రేవు కిటకిటలాడుతోంది. గోదావరిలో కార్తీక దీపాలు విడిచి పెట్టి భక్తులు పూజలు చేస్తున్నారు. శివాలయాల్లో భక్తులు బారులు దీరారు.

రాజమండ్రిలో కార్తీక పౌర్ణమి శోభ..

రాజమండ్రిలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. గోదావరి స్నానఘట్టాల్లో భక్తుల పుణ్య స్నానాలు చేశారు. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి


ఈ వార్తలు కూడా చదవండి..

మదనపల్లి ఘటన.. వెలుగులోకి కీలక అంశాలు ..

పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు..

ఏపీపీఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న మంత్రి పయ్యావుల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 15 , 2024 | 10:37 AM