TDP: టీడీపీకి రాజీనామా చేయబోతున్నా.. ఎంపీ కేశినేని నాని సంచలనం..
ABN, Publish Date - Jan 06 , 2024 | 06:42 AM
విజయవాడ ఎంపీ కేశినేని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు.
అమరావతి: విజయవాడ ఎంపీ కేశినేని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. ‘‘చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను’’ అని నాని ఎక్స్ వేదికగా తెలిపారు.
నిన్నటి నుంచి కేశినేని నాని సంచలనాలకు తెరదీస్తున్నారు. ఫేస్‌బుక్ వేదికగా నిన్న ఎంపీ కేశినేని నాని ఒక పోస్ట్ పెట్టారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతల ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి చెప్పారని వివరించారు. తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని కూడా పేర్కొన్నారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. ఈ క్రమంలోనే నేడు రాజీనామా చేయబోతున్నట్టు ఎక్స్ వేదికగా తెలిపారు.
Updated Date - Jan 06 , 2024 | 06:42 AM