ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Twist: జగన్, అదానీ వ్యవహారంలో వెలుగులోకి కొత్త విషయాలు..

ABN, Publish Date - Nov 27 , 2024 | 02:02 PM

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జగన్, అదానీ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆఘ మేఘాలపై విద్యుత్‌పై కుదిరిన అనుబంధం.. ఒప్పందాల గుట్టు రట్టయింది. మంత్రి వర్గం ఆమోదం లేకుండానే రెండు అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు జరిగిన విషయం బయటకు వచ్చింది.

అమరావతి: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జగన్ (Jagan), అదానీ (Adani) వ్యవహారంలో (Affair) సరికొత్త విషయాలు (New Twist) వెలుగులోకి వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించి మరీ అదానీకి అనుమతులు ఇచ్చిన విషయం సంచలనం రేపుతోంది. ఆఘ మేఘాలపై కుదిరిన అనుబంధం.. ఒప్పందాల గుట్టు రట్టయింది. మంత్రి వర్గం ఆమోదం లేకుండానే రెండు అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు జరిగిన విషయం బయటకు వచ్చింది. ఈ వ్యవహారం మొత్తంలో ఏపీపీసీసీ ఛైర్మన్ (APPCC Chairman) హోదాలో విజయానంద్ (Vijayanand) తీవ్ర ఉల్లంఘలకు పాల్పడినట్లు సమాచారం.


మంత్రి వర్గం ఆమోదం మేరకు ఏదైనా ఒప్పందం కురుర్చుకుంటే అందులో మార్పు చేర్పులకు మళ్లీ మంత్రి వర్గం ఆమోదం పొందాలి. కానీ అందుకు విరుద్ధంగా అధికారుల కమిటీయే ఆ ఒప్పందంలో మార్పు చేర్పులకు సమ్మతిస్తే వాటి ఆధారంగా అనుబంధ ఒప్పందాలు కూడా జరిగిపోతే అది ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇలాంటి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారు.


సెకీ నుంచి 7వేల మెగావాట్ల సౌరవిద్యుత్ కొనుగోలు కోసం డిస్కంలతో కలిపి ఏపీ ప్రభుత్వం 2021 డిసెంబర్ 1న ప్రధాన ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో 4,667 మెగా వాట్ల అదానీ రెన్యువబుల్ ఎనర్జీ నుంచి 2,333 మెగావాట్ల అజార్ పవర్ ఇండియా నుంచి కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేలా సెకీ.. ఆ సంస్థలతో మరో ఒప్పందం చేసుకుంది.సెకీకి 2,333 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా ప్రాజెక్టులో తాము కొనసాగలేమంటూ సీటీయుఐఎల్ 2023 జులై 6 నిర్వహంచిన సమీక్ష సమావేశంలో అజార్ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలియజేసింది. సెకీతో తాము కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలిగేందుకు అనుమతించాలని విన్నవిస్తూ సెకీకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

9వ అంతస్తుపై నుంచి కింద పడి యువతి మృతి...

తిరుపతన్న బెయిల్ ఫిటిషన్ వాయిదా..

వాదంలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక

హైడ్రా రంగనాథ్‌కు బక్క జడ్సన్ సవాల్..

విజయపాల్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 27 , 2024 | 02:03 PM