నాన్ ఇంటర్ లాకింగ్ పనులు.. 26 రైళ్లు రద్దు.. 21 డైవర్షన్
ABN, Publish Date - Dec 24 , 2024 | 01:09 AM
బెజవాడకు భవానీలు పోటెత్తుతున్న నేపథ్యంలో, మరోవైపు రైల్వే అధికారులు ముందస్తు ఆలోచన లేకుండా భారీ సంఖ్యలో రైళ్లను రద్దుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరానికి భవానీలు తరలివస్తున్న సమయంలో రైల్వే అధికారులు నాన్ ఇంటర్‌లాక్ పనులు చేపట్టారు. అర్ధంతరంగా పనులు చేపట్టడం వల్ల భవానీలకు ఇబ్బందులు తప్పలేదు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బెజవాడకు భవానీలు పోటెత్తుతున్న నేపథ్యంలో, మరోవైపు రైల్వే అధికారులు ముందస్తు ఆలోచన లేకుండా భారీ సంఖ్యలో రైళ్లను రద్దుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరానికి భవానీలు తరలివస్తున్న సమయంలో రైల్వే అధికారులు నాన్ ఇంటర్‌లాక్ పనులు చేపట్టారు. అర్ధంతరంగా పనులు చేపట్టడం వల్ల భవానీలకు ఇబ్బందులు తప్పలేదు. నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడంతో విజయవాడకు రాకపోకలు సాగించే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాజీపేట-విజయవాడ సెక్షన్‌లో మోటుమర్రి వద్ద నాన్ ఇంటర్‌లాకింగ్‌పనుల కారణంగా 26 రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరో 21 రైళ్లను డైవర్షన్ చేసింది.
ఫ డోర్నకల్-విజయవాడ (07755), విజయవాడ డోర్నకల్ (07756), విజయవాడ-భద్రాచలం (07979), భద్రాచలం-విజయవాడ (07278), గుంటూరు-సికింద్రాబాద్ (12705), సికింద్రబాద్-గుంటూరు (1206), విజయవాడ-సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్-విజయవాడ (12714), కొచ్చివేలు-ఇండోర్ (22646), ఇండోర్-కొచ్చువేలు (22645), కొచ్చువేలు-కోర్బా (22648), కోర్బా-కొచ్చువేలు (22647), గోరఖపూర్-కొచ్చువేలు(12511), కొచ్చువేలు-గోరఖ్‌పూర్ (12512), బారౌని-ఎర్నాకుళం(12521), ఎర్నాకుళం-బారౌని (12522), ధన్‌బాద్-కోయంబత్తూరు (03325), కోయంబత్తూరు-ధన్‌బాద్(03326), హిస్సార్-తిరుపతి (04717), తిరుపతి-హిస్సార్ (04718), బెంగళూరు-దానాపూర్ (06509), దానాపూర్-బెంగళూరు(06510)
ఫ గుంటూరు-సికింద్రబాద్ (17201) సికింద్రాబాద్-గుంటూరు (17202) రైళ్లను జనవరి 9 వరకు పాక్షికంగా రద్దు చేశారు.
ఫ విశాఖపట్నం-ముంబాయి, షాలిమార్-హైదరాబాద్, సాయినగర్ షిర్డీ-కాకినాడ పోర్టు, సాయినగర్ షిర్డీ-మచిలీపట్నం, మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ, ముంబాయి-భువనేశ్వర్, భువనేశ్వర్-ముంబాయి, షాలిమార్-సికింద్రాబాద్, విశాఖపట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-షాలిమార్, హెచ్ నిజాముద్దీన్-కన్యాకుమారి, హెచ్‌నిజాముద్దీన్-త్రివేండ్రం, హెచ్ నిజాముద్దీన్-ఎర్నాకుళం, దానాపూర్-బెంగళూరు, బెంగళూరు-దానాపూర్ రైళ్లను విజయవాడ, గూడూరు, వరంగల్, కాజిపేట స్టేషన్ల మీదుగా వెళ్లటాన్ని తొలగించారు.
Updated Date - Dec 24 , 2024 | 01:09 AM