Pawan Kalyan: ఆయన ఎన్నో విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు: పవన్ కల్యాణ్
ABN, Publish Date - Nov 27 , 2024 | 08:59 AM
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ తనకు ఎన్నో విలువైన సూచనలు సలహాలు ఇచ్చారని.. బిజీ షెడ్యూల్‌లో తనకు సాదర స్వాగతం పలికిన ఉప రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి (Vice President of India) జగదీప్ ధన్‌కర్‌ను (Jagdeep Dhankar) కలవటం గౌరవంగా భావిస్తున్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ (AP Deputy CM Pawan Kalyan) సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి బిజీ షెడ్యూల్‌లో తనకు ఇచ్చిన సమయానికి తాను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జగదీప్ ధన్‌కర్ తనకు ఎన్నో విలువైన సూచనలు సలహాలు ఇచ్చారని.. తనకు సాదర స్వాగతం పలికిన ఉప రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ప్రధానితో పవన్ భేటీ
కాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన 3 వ రోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం గం. 9.30 గంటలకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ అవుతారు. 10,30 గంటలకు పార్లమెంట్‌భవనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. అలాగే ఈరోజు సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు పవన్ విందు ఇవ్వనున్నారు. వారికి తాజ్ హోటల్‌లో విందు ఏర్పాటు చేశారు. ఏపీలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంపీలతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలకు పవన్ కల్యాణ్ విందుకు ఆహ్వానించారు.
జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం..
కాగా సమోసాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం రూ.9 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆసలు బాధ్యత అనేది లేకుండా వ్యవహరించిందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లేవన్నారు. ఆ ప్రభుత్వం చేసిన తప్పులకు బాధ్యత వహించేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలిచ్చారు. అదానీ-జగన్ వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్జీవీ వ్యవహారంపై స్పందిస్తూ పోలీసులు వాళ్ల పని చేస్తున్నారని అన్నారు. హోంశాఖ, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదని, మీరు అడగాల్సింది ముఖ్యమంత్రిని అని మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇబ్బంది పెట్టిన వారిని పట్టుకోవడానికి ఎందుకు తటపటాయిస్తున్నారని ఢిల్లీ మీడియా అడిగిందని సీఎంకి చెబుతానని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డియో విడుదల చేసిన రాంగోపాల్ వర్మ..
జీడిమెట్లలో ఇంకా ఆదుపులోకి రాని మంటలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 27 , 2024 | 08:59 AM