ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: పవన్ మార్క్ పాలన.. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న జనసేనాని..!

ABN, Publish Date - Jul 07 , 2024 | 02:23 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేరంటూ 2019 ఎన్నికల తర్వాత నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఎంతోమంది విమర్శించారు. చివరకు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లో తొలిసారి అడుగుపెట్టారు.

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేరంటూ 2019 ఎన్నికల తర్వాత నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఎంతోమంది విమర్శించారు. చివరకు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లో తొలిసారి అడుగుపెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుని నెలరోజులు పూర్తికాకుండానే.. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. నీతి, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ.. తన వద్ద పనిచేసే అధికారులు అంతే నిజాయితీతో ఉండాలని పవన్ సూచిస్తున్నారట. గతాన్ని వదిలేసి.. ప్రస్తుతం ప్రజాకోణంలోనే ప్రతి ఒక్కరూ పనిచేయాలని తన పేషీలో అధికారులకు ఆల్రెడీ పవన్ చెప్పేశారట. ప్రజాసమస్యలకు ప్రాధాన్యమిస్తూ.. ప్రతిరోజూ అర్థరాత్రి వరకు తన విధులను నిర్వర్తిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తన మంత్రిత్వశాఖలకు సంబంధించిన ఫైల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆయన సంతకాలు చేస్తున్నారట. ఓ రకంగా చెప్పాలంటే గ్రామీణాభివృద్ధి శాఖలో తన మార్క్‌ను చూపించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించిన వాళ్లంతా ఆయన పాలనను ప్రశంసిస్తున్నారట.

Chandrababu: నా కోసం చేసిన ఆందోళనలు చూసి గర్వపడ్డా..: చంద్రబాబు


నెలకాకుండానే..

సరిగ్గా పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా నెలరోజులు గడవలేదు. తక్కువ సమయంలోనే తన శాఖలపై పట్టుపెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. అధికారులు పవన్ కళ్యాణ్‌ సంతకాల కోసం దస్త్రాలు తీసుకొస్తే.. వాటిని సమగ్రంగా పరిశీలించి సంతకాలు పెడుతున్నట్లు తెలుస్తోంది. మీరు సంతకం చేస్తే చాలని అధికారులు అంటే వారికి పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారట.. కళ్లు మూసుకుని తాను సంతకాలు చేయబోనని.. గుడ్డిగా సంతకాలు పెడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని పవన్ అధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నిజాయితీగా ఉండకపోతే సహించేది లేదని డిప్యూటీ సీఎం అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. నెలరోజుల్లోనే గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారనే చర్చ జరుగుతోంది.

Chandrababu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కళ్లు..


ప్రజాసమస్యలపై..

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యల పరిష్కారంపై ఉక్కుపాదం మోపినట్లు జనసేన శ్రేణులు చెప్పుకుంటున్నారు. సమస్యలతో పవన్ దగ్గరకు వెళ్తే సొల్యూషన్ గ్యారంటీ అనే విధంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారనే చర్చ జరుగుతోంది. భీమవరం అమ్మాయి మిస్సింగ్ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును చాలామంది ప్రశంసిస్తున్నారు. దీంతో ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు పవన్ దగ్గరకు క్యూకడుతున్నారట. నెలరోజుల్లోనే పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ఇదే వేగాన్ని కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.


YS Jagan: ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా..!?

TDP: టీడీపీ ఆఫీసులోకి దూరి సీనియర్ నేతపై కానిస్టేబుల్ దాడి..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 07 , 2024 | 02:23 PM

Advertising
Advertising
<