ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేర్ని నాని అరెస్టు తప్పదు

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:16 AM

పేదల బియ్యం మాయం కేసులో తప్పించుకు తిరుగుతున్న పేర్ని నానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మునిసిపల్‌ పార్కు వద్ద ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పేదల బియ్యం మాయం కేసులో తప్పించుకు తిరుగుతున్న పేర్ని నానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మునిసిపల్‌ పార్కు వద్ద ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. సొంత గోదాములో బియ్యం మాయమైతే తెలియదని పేర్ని నాని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుతిరుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. గోదాములో బియ్యం మాయంపై పూర్తి విచారణ జరిపిస్తామని, దోషులు అందరినీ శిక్షించి తీరతామన్నారు. అడగకుండానే రూ. 1.70 కోట్లు ప్రభుత్వానికి ఎందుకు చెల్లించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా గుట్టు బయటపెడతామన్నారు. ఇంట్లో మహిళల్నీ రోడ్డున పడేసిన విధానం చూస్తుంటే సిగ్గేస్తోందన్నారు. ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, పేర్ని నాని గోదాము నిర్మాణమే అవినీతి సొమ్ముతో జరిగిందని, అధికారుల్ని అడ్డంపెట్టుకుని ఉపాధి హామీ నిధుల్ని దుర్వినియోగం చేసి మట్టి తరలించుకున్నారన్నారు. అవినీతికి సహకరించిన అధికారుల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని, మెడికల్‌ కాలేజీ పేరుతో చేసిన దోపిడీని కాగ్‌ నివేదికలో పేర్కొందన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా దోచుకుని ఇప్పుడు తప్పించుకోవాలనుకుంటే కుదరదన్నారు. పేర్ని నాని ఎక్కడ దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. దోపిడీలను బట్ట బయలు చేసి ప్రజా కోర్టులో దోషిగా నిలబడెతామన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 01:16 AM