ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన ఘటనలో ఊహించని విషయం వెలుగులోకి!

ABN, Publish Date - Sep 08 , 2024 | 06:33 PM

ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో వరదలు ఉప్పొంగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్‌లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బోట్లు ఎవరివి? వాటిని ఎవరు నడుపుతున్నారు? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

అమరావతి: ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో వరదలు ఉప్పొంగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్‌లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బోట్లు ఎవరివి? వాటిని ఎవరు నడుపుతున్నారు? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఈ బోట్లు శేషాద్రి, కోమటి రామ్మోహన్‌ నిర్వహిస్తున్నారని, వీటిని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కోమటి రామ్మోహన్ వైసీపీ నేత తలశిల రఘురాం మేనల్లుడు అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ బోట్లును కావాలని వదిలారా? లేక ఎలా వచ్చాయి? అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.


జలవనరుల శాఖ ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో హోమ్ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి వెళ్లి బోట్లు ఢీ కొట్టడంతో కౌంటర్ వేయిట్లు విరిగిపోయిన ప్రాంతాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. కాగా ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. వైసీపీ నేతల కుట్ర ఉందంటూ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


కాగా బ్యారేజ్‌ను ఢీకొట్టిన బోట్లకు 5 సంవత్సరాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్దంగా వీటిని నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. వైసీపీ పెద్దల హస్తంతో ఇష్టానుసారంగా ఐదేళ్లుగా ఇసుక తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసిందే. 2019 లో జరిగిన పడవ ప్రమాదానికి సంబంధించి కూడా ఎటువంటి విచారణ జరగలేదు. అప్పటి బోటు ప్రమాదంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Sep 08 , 2024 | 06:33 PM

Advertising
Advertising