తెలుగు పరిరక్షణ అందరి బాధ్యత
ABN, Publish Date - Dec 29 , 2024 | 01:39 AM
తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత అని పలువురు వక్తలు పేర్కొన్నారు. కేబీఎన్ కళాశాలలో శనివారం ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనాచౌదరి, సినీగేయరచయిత భువనచంద్ర, పలువురు రచయితలు హాజరయ్యారు.
ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో వక్తలు
తెలుగు పదాలతో ఒక వాక్యమైనా చెప్పలేకపోతున్నాం: ఎమ్మెల్యే సుజనాచౌదరి
విజయవాడ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): పూర్తి తెలుగు పదాలు ఉపయోగించి ఒక వాక్యాన్ని కూడా చెప్పలేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణచౌదరి(సుజనా చౌదరి) అన్నారు. కేబీఎన్ కళాశాలలో నిర్వ హిస్తున్న ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో ఆయన మాట్లా డారు. ‘మార్పు’ గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. మాతృభాషపై పట్టు సాధించినప్పుడు పర భాషలను నేర్చుకోవడం ఎంతో సులువుగా ఉంటుం దన్నారు. పరభాష మోజులో తెలుగును విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ, కులమత వ్యత్యాసాలు లేకుండా తెలుగు భాష పరి రక్షణకు పాటుపడాలన్నారు. మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ఇంగ్లీ్‌షలో మాటా ్లకుండా ఇండియా టీంకు ఎంపికై కెప్టెన్ అయ్యారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇంటి నుంచే తెలుగు అలవాటుచేసుకోవాలి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వీసీ కేఆర్ రజిని
విజయవాడ కల్చరల్: ‘ఇంటి నుంచే తెలుగు మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. తెలుగుభాషను సంరక్షించుకోవడంలో ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత వహించాలి. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు, మాతృభాష పట్ల బాధ్యతను తెలుసుకోవాలి.’ అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం వీసీ కేఆర్ రజిని అన్నారు. చెరుకూరి రామోజీరావు వేదికపై నిర్వహించిన మహిళా ప్రతినిధుల సదస్సులో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె ప్రసంగించారు. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షత వహించారు. రచయిత్రులు కాకినాడ చెందిన విజయ కట్టా, స్ఫూర్తి, హైదరాబాద్‌కు చెందిన ఇంద్రగంటి జానకిబాల, నెల్లూరుకు చెందిన కల్లకూరు జయప్రద, విశాఖపట్నానికి చెందిన బి.హేమలత, హైదరాబాద్‌కు చెందిన స్వాతిశ్రీపాద, భానుమతి, బాపట్లకు చెందిన భవానీదేవి, హైదరాబాద్‌కు చెందిన కేతవరపు రాజశ్రీ, వెలవోలు నాగరాజ్యలక్ష్మి, తాటికోల పద్మావతి, విజయవాడ చెందిన కావూరి సత్యవతి, హైదరాబాద్‌కు చెందిన అల్లూరి గౌరీలక్ష్మి తెలుగు భాష వైభవాన్ని వివరించారు. దాశరథి సభా వేదికపై తొలుత కవిత సదస్సు నిర్వహించారు. అనంతపురానికి చెందిన డాక్టర్ రాజయ్య సభకు అధ్యక్షత వహించారు. మంగళగిరికి చెందిన డాక్టర్ పాలపర్తి శ్యామల ఆనంద ప్రసాద్, ఆంధ్ర సారశ్వత్ పరిషత్తు చక్రవధువుల రెడ్డప్ప, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి తెలగరెడ్డి సత్యానందం, కరీంనగర్‌కు చెందిన నామని సుజనాదేవి, జమ్మలమడుగుకు చెందిన కుందా భాస్కర్, హైదరాబాద్‌కు చెందిన రమాజ్ శాండిల్య, శ్రీకాకుళానికి చెందిన భోగిల ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
పుస్తకాల ఆవిష్కరణ
విజయవాడ కల్చరల్: ఆంధ్ర మహాభారతం సూక్ష్మ పరిశీలన విశిష్ట సన్నివేశాలు, గద్వాల్ సోమన్న రచించిన తారాజువ్వలు, రేపటి వెలుగులు పుస్తకాలను ఆవిష్కరించి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు అంకితం చేశారు. కల్వకుంట్ల రాజేష్ రెడ్డి రచించిన వెలుగు మువ్వలనే పుస్తకాన్ని, భవానీ శంకర్ రచించిన విపంచిక ఖండ కావ్యం, బెల్లంకొండ శ్రీనివాస్ రచించిన ఆమె నవలను ఆవిష్కరించారు. ఈ గ్రంథాలన్నింటిని సుప్రీంకోర్టు మాజీ సీజే నూతలపాటి వెంకటరమణ, సతీ్‌షరెడ్డి, మండలి బుద్ధప్రసాద్‌ఆవిష్కంచారు. డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి అధ్యక్షత వహించగా దుబాయ్‌కు చెందిన డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి, అమెరికాకు చెందిన అశ్వినీ ఫణీంద్ర, ప్రమోద ఫణీంద్ర మాట్లాడారు.
సాంకేతికత ఆధారంగా డిక్షనరీలు
సాంకేతికత ఆధారంగా డిక్షనరీలను సులభంగా రూపొందించడం, ఒకేసారి మూడు భాషలకు సంబంధించిన అర్థాలు వివరించటం, ఈజీగా డౌన్లోడ్ చేసుకునే పద్ధతులను గుంటూరుకు చెందిన పెద్ద సాంబశివరావు వివరించారు. జగ్గయ్యపేటకు చెందిన సరికొండ నరసింహరాజు తల్లడిల్లే తల్లి వేదం కవిత్వాన్ని వినిపించారు. బెంగళూరుకు చెందిన ఏఎ్‌ససీ రావు, నౌకాపు వెంకటరమణ, కప్ప దుర్గారావు, జె.సీతాపతిరావు, అక్కినేనిభవానీప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - Dec 29 , 2024 | 01:40 AM