ప్రజా నాయకుడు వీఎం రంగా
ABN, Publish Date - Dec 24 , 2024 | 12:55 AM
మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు ప్రజా నాయకుడు అని ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
రంగా విగ్రహ పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు
పాతరాజరాజేశ్వరి పేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు ప్రజా నాయకుడు అని ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. పాయకాపురం-కండ్రిక కూడలి వద్ద నవీకరించిన వీఎం రంగా విగ్రహానికి పునఃప్రారంభ కార్యాక్రమాన్ని సోమవా రం విగ్రహ కమిటీ నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొండా ఉమా విచ్చేశారు. రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీ యాలకు అతీతంగా నాయకులంతా రంగా ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని ఉమా సూచించారు. విగ్రహ కమిటీ గౌరవ సలహాదా రులు నవనీతం సాంబశివరావు, మద్దంశెట్టి వీరాంజనే యులు, వత్తే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 12:55 AM