Republic Day: దేశసేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన తరుణం: పురందేశ్వరి
ABN, Publish Date - Jan 26 , 2024 | 10:34 AM
విజయవాడ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
విజయవాడ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ దేశసేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన తరుణమిదని, స్వాతంత్య్రం కోసం బలిదానం చేసిన వారిని స్మరించుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకోవాలని, ప్రధాని నరేంద్రమోదీ అంత్యోదయ స్ఫూర్తిగా అడుగులు వేస్తున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదని, సమసమాజ స్థాపన భావన కనిపించడంలేదని, ప్రభుత్వం ప్రజల హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని పురందేశ్వరి మండిపడ్డారు. వాక్ స్వాతంత్ర్యం అనేది రాష్ట్రంలో ఎవరికీ లేకుండా పోయిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే జైలుకు పంపుతున్నారని, అవినీతిని ప్రశ్నిస్తే భయపెట్టి నిర్భందాలు, వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సేవ భావన వైసీపీ పాలనలో కనిపించడంలేదన్నారు. ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి తిలోకదకాలిచ్చారన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు, వెంకయ్యనాయుడు, చిరంజీవి, ఉమామహేశ్వరిలకు పురందేశ్వరి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని సమన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం రాష్ట్రంలో కొరవడ్డాయన్నారు. సమాఖ్య వ్యవస్థలో కొన్ని రాష్ట్రాల వ్యవహారాలు దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జన్సీ కొనసాగుతోందని.. ప్రజలను గాలికొదిలేశారని విమర్శించారు. మన దేశం వసుదైక కుటుంబం అనే భావనను ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచానికి చాటారని సత్యకుమార్ పేర్కొన్నారు.
Updated Date - Jan 26 , 2024 | 10:34 AM