ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా ఫిర్యాదులపై స్పందించండి

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:13 AM

ప్రజాసమస్యల పరిష్కారవేదిక(మీకోసం) కార్యక్రమంలో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కృష్ణా జిల్లా జేసీ గీతాంజలిశర్మ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో కలిసి ఆమె ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ గీతాంజలిశర్మ

మచిలీపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసమస్యల పరిష్కారవేదిక(మీకోసం) కార్యక్రమంలో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కృష్ణా జిల్లా జేసీ గీతాంజలిశర్మ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో కలిసి ఆమె ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ, ఈనెల 19 నుంచి 25వరకు కేంద్రప్రభుత్వం ఆదేశాలమేరకు ప్రశావన్‌ గావ్‌ సప్త్‌హ(గుడ్‌ గవర్నెస్‌) కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో వివిధ శాఖలద్వారా అమలుచేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సక్సె్‌సస్టోరీలను ఈనెల 25లోగా అధికారులు సమర్పించాలన్నారు. డీఆర్వో కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ, మండలస్థాయిలోనూ మీకోసం కార్యక్రమం నిర్వహించాలని వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా తహసీల్దార్‌లకు సూచించారు. భూ వివాదాలకు సంబంధించిన అంశాలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీటి పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో అధికారులు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. ఈనెల 28న ఉమ్మడికృష్ణాజిల్లాలో ‘వన్‌మాన్‌ కమిషన్‌ ఆన్‌ ఎస్సీ సబ్‌క్లాసిఫికేషన్‌’ అంశంపై విజిట్‌ ఉంటుందని, అన్ని శాఖల అధికారులు నిర్థేశించిన ఫార్మాట్‌లో నివేదికలను సమర్పించాలన్నారు. జాతీయ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా దివ్యాంగురాలికి ఉపాధికోసం రూ.5లక్షల చెక్కును జేసీ అందజేశారు. కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీదేవి, మెప్మాపీడీ సాయిబాబు, పౌరసరపరాలశాఖ డీఎం పద్మాదేవి, డీఎ్‌సవో పార్వతి వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ దీర్ఘకాలిక వ్యాధులతో మంచాన ఉన్న దివ్యాంగులకు సంబంధించి ఆస్తుల రిజిస్ర్టేషన్‌కు రిజిషా్ట్రర్లు ఇళ్లవద్దకే వెళ్లి సేవలందించాలని జేసీ గీతాంజలి శర్మకు కృష్ణాజిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రహ్మణ్యం సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ అంశాన్ని పరిశీలించి తక్షణమే సేవలందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 01:13 AM