ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Search Operation: ఎంపీడీవో అదృశ్యంపై కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

ABN, Publish Date - Jul 18 , 2024 | 10:45 AM

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు అదృశ్యంపై సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎంపీడీవో అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. కాగా స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి మనో ధైర్యం చెప్పారు.

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో (MPDO) ఎం.వెంకటరమణారావు (M.Venkataramanarao) అదృశ్యం (Disappear)పై సెర్చ్ ఆపరేషన్ (Search Operation) కొనసాగుతోంది. ఎంపీడీవో అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pavan Kalyan) కోరారు. కాగా స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ (MLA Bode Prasad) బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి మనో ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి, వైసీపీకి చెందిన ప్రభుత్వ మాజీ విప్‌ ప్రసాదరాజు అండదండలతో కాంట్రాక్టరు ధవేజీ చేస్తున్న బెదింపులను తట్టుకోలేకపోతున్నానని, తనకు న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పేరిట లేఖ రాసి ఎంపీడీవో అదృశ్యమయ్యారు. తన తండ్రి కనిపించకుండా పోయాడంటూ వెంకటరమణారావు చిన్న కుమారుడు మహీధర్‌ ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం మేరకు.. వెంకటరమణారావు సుమారు ఐదు నెలల నుంచి నరసాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10 నుంచి సెలవు పెట్టి పెనమలూరు దరి కానూరు మహదేవపురం కాలనీలోని ఇంటివద్దనే ఉంటున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మచిలీపట్నం వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం మూడున్నరకు ఇంటికి ఫోన్‌చేసి తాను బందరులోనే ఉన్నానని, ఇంటికి రావడంలేదని చెప్పారు. తర్వాత అర్ధరాత్రి ఆయన ఫోన్‌ నుంచి.. ఈ రోజు నా పుట్టిన రోజు, చనిపోయేరోజు కూడా, ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండమని కుటుంబసభ్యులకు మెసేజ్‌ వచ్చింది. కంగారుపడిన కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆయన బండి కూడా బందరు రైల్వే స్టేషన్లోనే ఉన్నట్లు గుర్తించారు.


వాట్సాప్‌లో పవన్‌ పేరిట సూసైడ్‌ నోట్‌

వెంకటరమణారావు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేరిట రాసిన సూసైడ్‌ నోట్‌ తన సెల్‌ఫోన్‌ నుంచి కుటుంబ సభ్యులకు పంపించారు. ఆ నోట్‌లో వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజుపై ఆరోపణలు చేశారు. గత మూడున్నరేళ్లుగా నరసాపురం ఫెర్రీకి చెందిన బోట్లకు రూ.55 లక్షలు చెల్లించవలసి ఉందని, ప్రసాదరాజు అండదండలతో ఆ కాంట్రాక్టరు సొమ్ము చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ప్రసాదరాజు ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నానని, దీన్నుంచి బయటపడే మార్గం కనిపించడంలేదని పేర్కొన్నారు. 33 ఏళ్లు నిజాయితీగా పనిచేసిన తాను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవాల్సి వస్తుందని అనుకోలేదని వాపోయారు.


కాగా ఎంపీడీవో వెంకట రమణా రావు అదృశ్యం కేసులో మిస్టరీ కొనసాగుతోంది. అదృశ్యమయ్యి నాలుగురోజులు అవుతున్నా ఆచూకీ దొరకడం లేదు. విజయవాడ మధురానగర్ వద్ద కాల్వలోకి దూకి ఉంటాడనే అనుమానంతో గాలింపు కొనసాగుతోంది. వెంకట రమణారావుకు తరచుగా తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజావాణిపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

జగన్ మార్క్ కొత్త దందా..

శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల నేడు..

మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 18 , 2024 | 10:45 AM

Advertising
Advertising
<