పాల ఫ్యాక్టరీలో సెమీక్రిస్మస్ వేడుకలు
ABN, Publish Date - Dec 22 , 2024 | 01:02 AM
పాల ఫ్యాక్టరీలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో చలసాని ఆంజనేయులు కేక్ కట్ చేశారు.
చిట్టినగర్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): క్రీస్తు బోధనలు ఆచరణీయమని కృష్ణా మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. శనివారం పాల ఫ్యాక్టరీలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన కేక్ కట్ చేశారు. పాడి రైతులకు వినియోగదారులకు, సమితి సిబ్బందికి క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఫాదర్ జేసుదాసు, సిస్టర్ కీర్తీ ప్రత్యేక ప్రార్థన చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు, సమితి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2024 | 01:02 AM